సోమవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 281 పాయింట్లు పెరిగి 72,708 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 81 పాయింట్లు పెరిగి 22,122 వద్ద ముగిసింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో బజాజ్ ఫిన్ సర్వ్, భారతి ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఐటీసీ, మారుతి, నెస్లే ఇండియా, టైటాన్, ఎంఅండ్ఎం, రిలయన్స్, ఎస్బీఐఎన్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యూనిలివర్, టెక్ మహీంద్రా, హెచ్ సీఎల్ టెక్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.
అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, ఏసియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, విప్రో, ఎల్ అండ్ టీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఆటో, ఐసిఐసిఐ బ్యాంక్, సిప్లా టాప్ గెయినర్లుగా ఉన్నాయి. కోల్ ఇండియా, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ అండ్ టి, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ నష్టపోయాయి.

సెక్టార్లలో, క్యాపిటల్ గూడ్స్, ఐటి మెటల్, రియల్టీ ఎరుపు నష్టాల్లో ముగిశాయి. ఆటో, బ్యాంక్, ఎఫ్‌ఎంసిజి, హెల్త్‌కేర్, ఆయిల్ & గ్యాస్, పవర్ 0.3-1 శాతం పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పెరిగాయి. పేటీఎం షేర్లు 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ ను తాకింది. గత కొద్ది రోజులు పడిపోతున్న స్టాక్ ఈ రోజు గ్రీన్ లో ముగిసింది.
నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఫిబ్రవరి 19న మధ్యాహ్నం ట్రేడింగ్‌లో 175 పాయింట్లు లేదా 0.93 శాతం పెరిగి 19,045.75 వద్ద 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. గత ఏడాది కాలంలో, ఇండెక్స్ బలమైన బ్రేకౌట్ తర్వాత 60 శాతానికి పైగా ఆకట్టుకునే రాబడిని అందించింది. బయోకాన్ లిమిటెడ్ (4.84 శాతం పెరిగింది), గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ (3.75 శాతం), నాట్కో ఫార్మా లిమిటెడ్ (3.65 శాతం), సనోఫీ ఇండియా లిమిటెడ్ (2.78 శాతం), అరబిందో ఫార్మా లిమిటెడ్ 2 శాతం లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications