Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఐటీ, బ్యాంకు స్టాకుల్లో ర్యాలీ..
వారంతంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభల్లో ముగిశాయి. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 684 పాయింట్లు పెరిగి 57,919.97 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 171 పాయింట్లు పెరిగి 17,185 వద్ద స్థిరపడింది. యూఎస్ లో ద్రవ్యోల్బణం అనుకున్న స్థాయిలో ఉండడంతో మార్కెట్ సానుకూలంగా స్పందించింది. బీఎస్ఈ-30 ఇండెక్స్ లో 20 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి.
ఇన్ఫోసిస్, హెచ్‍డిఎఫ్‍సీ బ్యాంక్, హెచ్‍డిఎఫ్‍సీ, హెచ్ సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్&టీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, డా. రెడ్డీస్, ఎస్బీఐన్, ఐటీసీ, నెస్లే ఇండియా, టైటాన్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనిలివర్, ఎన్టీపీసీ, టాటా స్టీల్ లాభాల్లో ముగిశాయి.

టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్, మారుతి, పవర్ గ్రిడ్, భారతి ఎయిర్టెల్, విప్రో, రిలయన్స్, ఏసియన్ పెయింట్స్, ఎం&ఎం కంపెనీలు నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.04 శాతం నష్టపోయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స 0.4శాతం పెరిగింది. నిఫ్టీ బ్యాంకు 1.76 శాతం పెరిగింది. నిఫ్టై ఐటీ 1.01 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.27 శాతం లాభపడింది. నిఫ్టీ మెటల్ 0.64 శాతం నష్టపోయింది.


Click it and Unblock the Notifications