గురువారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 143 పాయింట్లు నష్టపోయి 64,832 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 48 పాయింట్ల కోల్పోయి 19,395 వద్ద స్థిరపడింది. రియాల్టీ సెక్టర్ లో పెరుగుదల కనిపించింది. రియాల్టీ సెక్టర్ తాజాగా 52 వారాల గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఎఫ్‌ఎమ్‌సిజి సెగ్మెంట్ ప్రధాన అండర్ పెర్ఫార్మర్‌గా ఉండగా, ఐటి స్టాక్ లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. భారత రూపాయి గత ముగింపు 83.27తో పోలిస్తే డాలర్‌కు 83.28 వద్ద స్థిరంగా ముగిసింది.
బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఎంఅండ్ఎం, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటర్స్, ఎల్అండ్ టీ, మారుతి, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీసీ, హెచ్ సీఎల్ టెక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, సన్ ఫార్మా లాభాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐఎన్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, విప్రో, నెస్లే ఇండియా, ఏసియన్ పెయింట్స్, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలివర్ నష్టాల్లో స్థిరపడ్డాయి.

నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, హెచ్‌యుఎల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అదానీ పోర్ట్స్, ఒఎన్‌జిసి టాప్ లూజర్‌గా ఉండగా, ఎం అండ్ ఎం, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా, హీరో మోటోకార్ప్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లాభపడ్డాయి.రియల్టీ, ఆటో సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరగడంతో సెక్టోరల్ ఫ్రంట్‌లో మిశ్రమ ధోరణి కనిపించింది. అయితే ఆయిల్ & గ్యాస్, ఎఫ్‌ఎంసిజి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం తగ్గాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్‌తో ముగియగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం క్షీణించింది.
సెప్టెంబరు త్రైమాసికంలో స్వీటెనర్ కంపెనీ రూ. 205.6 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేయడంతో నవంబర్ 9న ప్రారంభ ట్రేడింగ్‌లో శ్రీ రేణుకా షుగర్స్ షేర్లు 3 శాతం పడిపోయాయి. 2016-17లో టెలికాం ఆపరేటర్ చెల్లించిన రూ. 1,128 కోట్లను తిరిగి చెల్లించాలని బాంబే హైకోర్టు ఆదాయపు పన్ను శాఖను ఆదేశించిన తర్వాత నవంబర్ 9న ప్రారంభ ట్రేడింగ్‌లో వోడాఫోన్ ఐడియా షేర్లు 2.5 శాతం పెరిగాయి.
More From GoodReturns

భారత స్టాక్ మార్కెట్: ద్రవ్యోల్బణం డేటాతో భారీ కుదుపులు తప్పవా?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

స్టాక్ మార్కెట్లలో ఈ వారం భారీ యాక్షన్, ఇన్వెస్టర్లు సిద్ధమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?

ఆర్బీఐ కీలక నిర్ణయం: మార్కెట్లలో భారీ కదలికలు ఖాయమా?

ఆర్బీఐ నిర్ణయం.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాకా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications