Stock Market: ఆల్ టైమ్ హైలో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రాణింటిన ఐటీ, ఆటో షేర్లు..
శుక్రవారం స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ హైలో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 319 పాయింట్లు పెరిగి 67,838 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 89 పాయింట్లు వృద్ధి 20,192 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో హెచ్ సీఎల్ టెక్, టాటా మోటర్స్, విప్రో, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఎంఅండ్ఎం, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, జేఎస్ డబ్య్లూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్, బజాబ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, మారుతి, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంకు లాభాల్లో ముగిశాయి.
ఎల్అండ్ టీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఇండస్ండ్ బ్యాంక్, ఐటీసీ, టైటాన్, హిందుస్తాన్ యూనిలివర్, ఏసియన్ పెయింట్స్ నష్టాల్లో స్థిరపడ్డాయి. ఐటీ స్టాక్స్ దాదాపు అన్ని పాజిటివ్ లో ముగిశాయి. బజాజ్ ఆటో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, M&M, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్‌టెల్ అత్యధికంగా లాభపడగా, నష్టపోయిన వాటిలో BPCL, Jio ఫైనాన్షియల్, టాటా కన్స్యూమర్ కంపెనీలు ఉన్నాయి.

అశోక్ లేలాండ్, TVS మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ (JV) కంపెనీని ఏర్పాటు చేయడానికి అంగీకరించాయి. TVS మొబిలిటీ 50.1%, కంపెనీ 49.9% జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేయనున్నారు. ఎఫ్‌ఎంసిజి, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ అండ్ రియాల్టీ 0.4-1 శాతం క్షీణించగా, ఆటో, బ్యాంక్, ఫార్మా, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ 0.3-1 శాతం వృద్ధి సాధించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సానుకూలంగా ముగిశాయి. చమురు ధర 0.5% పెరిగి శుక్రవారం $90.55/b వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications