Stock Market: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 20 పాయింట్ల పెరిగి 74,248 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్లాట్ గా అంటే.. 22513 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో కొటాక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఐటీసీ, ఎస్బీఐఎన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, పవర్ గ్రిడ్, హిందస్థాన్ యూనిలివర్, హెచ్ సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ లాభాల్లో ముగిశాయి.
రిలయన్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, విప్రో, జేఎస్ డబ్ల్యూ స్టీల్, నెస్లే ఇండియా, టైటాన్, టీసీఎస్, సన్ ఫార్మా, ఏసియన్ పెయింట్స్, మారుతీ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్, ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీలో కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ ఐటీసీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్ టీ నష్టాల్లో ముగిశాయి. బ్యాకింగ్, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ 0.5 నుంచి 1.5 శాతం, ఐటీ, మీడియా 0.4 శాతం చొప్పిన నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 0.5 శాతం చొప్పున పెరిగాయి.
భారతీ హెక్సాకామ్ పబ్లిక్ ఇష్యూకి బిడ్డింగ్ చివరి రోజైన ఏప్రిల్ 5న 70.87 కోట్ల షేర్లకు బిడ్డింగ్ వచ్చింది. ఈ ఐపీఓ 17.18 రెట్లు ఎక్కువ సబ్స్క్రైబ్ అయింది. క్యూఐబీ పోర్షన్ 26.82 రెట్లు సబ్స్క్రైబ్ కాగా.. NIIలు 7.86 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్ కోటా 2.24 రెట్లు బ్‌స్క్రయిబ్ అయింది. ఆర్‌బీఐ ద్రవ్య విధానం దృష్టి కేంద్రీకరించడంతో భారత రూపాయి 11 పైసలు లాభపడింది. 5-1 మెజారిటీ ఓట్లతో RBI రెపో రేటును యథాతథంగా ఉంచింది. సెంట్రల్ బ్యాంక్ FY25 కోసం సీపీఐ 4.5 శాతం, జీడీపీ 7 శాతం వద్ద ఉంచింది.


Click it and Unblock the Notifications