సోమవారం స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 19 పాయింట్ల తగ్గి 75,390 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 24 పాయింట్లు తగ్గి 22,932 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సెస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్, ఎల్అండ్ టీ, ఎస్బీఐఎన్, టెక్ మహీంద్రా, హెచ్ సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనిలీవర్ లాభాల్లో ముగిశాయి.
ఏసియన్ పెయింట్స్, టీసీఎస్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, నెస్లే ఇండియా, టాటా మోటార్స్, భారతి ఎయిర్ టెల్, బజాజ్ ఫిన్ సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, మారుతి, రిలయన్స్, ఐటీసీ, ఎంఅండ్ఎం, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, విప్రో నష్టాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, యాక్సెస్ బ్యాంక్, ఎల్అండ్ టీ, ఇన్ఫోసిస్, ఎస్బీఐఎన్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

బ్యాంకింగ్‌తో పాటు, రియల్టీ రంగం మంచి పనితీరును కనబరిచాయి. అయితే మీడియా, ఎనర్జీ రంగాలు నష్టపోయాయి.సెక్టోరల్‌లో బ్యాంక్, రియాల్టీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం లాభపడగా, ఆయిల్ & గ్యాస్, పవర్, మీడియా 0.5-1 శాతం క్షీణించాయి. రూపాయి 0.02 బలహీనంగా ట్రేడవుతూ, 83.13 వద్ద ముగిసింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం లాభపడగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది.


Click it and Unblock the Notifications