శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతోన్నాయి. ఉదయం 10 గంటల 14 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 310 పాయింట్లు వృద్ధి చెంది 69,832 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 93 పాయింట్లు వృద్ధి చెంది 20,994 వద్ద కొనసాగుతోంది.
బీఎస్ఈ 30 ఇండెక్స్ లో జెఎస్ డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, హెచ్ సీఎల్ టెక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా, విప్రో, టైటాన్, టాటా స్టీల్, కోటాక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఏసియన్ పెయింట్స్, సన్ ఫార్మా,టెక్ మహీంద్రా లాభాల్లో ట్రేడవుతోన్నాయి.

అల్ట్రా టెక్ సిమెంట్, టీసీఎస్, ఐటీసీ, రిలయన్స్, టాటా మోటర్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతి, ఎస్బీఐఎన్, భారతీ ఎయిర్ టెల్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. కన్సోర్ టెర్మినల్స్‌లో PV సోలార్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటు కోసం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు NTPC విద్యుత్ వ్యాపార నిగమ్ (NVVN) అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేశాయి. కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి మరియు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కంపెనీల నిబద్ధతకు ఇది అనుగుణంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications