స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల 36 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 268 పాయింట్లు కోల్పోయి 72,563 ట్రేడవుతోంది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 22,026 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ, టాటా స్టీల్, హెచ్ సీఎల్ టెక్ లాభాల్లో ట్రేడవుతోన్నాయి.
కొటాక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, ఐటీసీ, సన్ ఫార్మా, ఎల్అండ్ టీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, విప్రో, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలివర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, టైటాన్, ఇన్ఫోసిస్, ఏసియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐఎన్, భారతీ ఎయిర్ టెల్, మారుతి, పవర్ గ్రిడ్ నష్టాల్లో కొనసాగుతోన్నాయి.

నిఫ్టీలో హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో ఉండగా.. పవర్ గ్రిడ్ కార్ప్, బ్రిటానియా, ఒఎన్‌జిసి, గ్రాసిమ్ మరియు టాటా కన్స్యూమర్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ తన ఆప్టికల్ ఫైబర్ ఆస్తులను కంపెనీ అనుబంధ సంస్థ అయిన ఇండస్‌ఇండ్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ (IMCL)కి రూ.208.04 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
డిసెంబర్ 2023లో నిర్వహించిన కంపెనీ మర్చంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాలు, రికార్డులను తనిఖీ చేసిన తర్వాత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ICICI సెక్యూరిటీలకు అడ్మినిస్ట్రేటివ్ హెచ్చరిక జారీ చేసింది. నిర్వాహక హెచ్చరిక లేఖ ను పంపింది.


Click it and Unblock the Notifications