స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతోంది. ఉదయం 9 గంటల 28 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 220 పాయింట్లు పెరిగి 72,271 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 80 పాయింట్లు పెరిగి 21,991 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో టాటా మోటర్స్, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, మారుతీ, టాటా స్టీల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, టీసీఎస్, అల్ట్రా టెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, రిలయన్స్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, కొటాక్ మహీంద్రా లాభాల్లో కొనసాగుతోన్నాయి.
ఎస్బీఐఎన్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, హెచ్ సీఎల్ టెక్, ఐటీసీ, పవర్ గ్రిడ్ లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీలో బీపీసీఎల్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎంలు లాభపడగా, ఓఎన్‌జీసీ, ఐటీసీ, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, యూపీఎల్ నష్టాల్లో ఉన్నాయి.
జాయింట్ వెంచర్ ద్వారా దిలీప్ బిల్డ్‌కాన్ కంపెనీ (విజయ్ కుమార్ మిశ్రా కన్‌స్ట్రక్షన్-దిలీప్ బిల్డ్‌కాన్) మధ్యప్రదేశ్ జలవనరుల శాఖ జరిపిన టెండర్‌కు ఎల్-1 బిడ్డర్‌గా ప్రకటించింది. జాయింట్ వెంచర్ కంపెనీ రూ.412.92 కోట్లతో టర్న్‌కీ ప్రాతిపదికన మాచ్రేవా నీటిపారుదల ప్రాజెక్ట్ డ్యామ్, ప్రెషరైజ్డ్ పైప్ ఇరిగేషన్ నెట్‌వర్క్‌ను నిర్మిస్తుంది.

ముడి పెట్రోలియంపై విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్‌ని ఫిబ్రవరి 15 నుంచి ప్రభుత్వం సవరించింది. సవరణల ప్రకారం క్రూడ్ పెట్రోలియంపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED) రూ. 3,300/టన్నుకు పెరుగుతుంది. అంతకుముందు రూ. 3,200/టన్నుకు గా ఉంది. ఈ నెల ప్రారంభంలో దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై ప్రభుత్వం విండ్ ఫాల్ ట్యాక్స్ ను టన్నుకు రూ.1,700 నుంచి రూ.3,200కి పెంచింది.
యూనియన్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, యాక్సిస్ సెక్యూరిటీస్ లిమిటెడ్, యాక్సిస్ క్యాపిటల్ ఇతరులపై ఢిల్లీ హైకోర్టులో సుబ్రమణియన్ స్వామి పబ్లిక్ ఇంట్రెస్ట్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. యాక్సిస్ బ్యాంక్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో షేర్ల లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. దీనిపై యాక్సిస్ బ్యాంక్ వివరణ ఇచ్చింది. ఈ లావాదేవీలకు సంబంధించి అవసరమైన అన్ని రెగ్యులేటరీ అనుమతులను పొందామని స్పష్టం చేసింది. ఎలాంటి నిరాధారమైన ఆరోపణలకు వ్యతిరేకంగా బ్యాంకును రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని బ్యాంక్ తెలిపింది.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications