మంగళవారం స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 50 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 55 పాయింట్లు పెరిగి 75446 ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 27 పాయింట్లు వృద్ధి చెంది 22959 కొనసాగుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో అల్ట్రా టెక్ సిమెంట్, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, విప్రో, సన్ ఫార్మా, రిలయన్స్, ఎల్అండ్ టీ, బాజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఏసియన్ పెయింట్స్, టైటాన్ లాభాల్లో కొనసాగుతోన్నాయి.
మారుతి, ఇన్ఫోసిస్, ఎస్బీఐఎన్, టీసీఎస్, హెచ్ సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, యాక్సెస్ బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐటీసీ నష్టాల్లో ట్రేడవుతోన్నాయి. నిఫ్టీలో హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, విప్రో, ఎన్‌టీపీసీ ప్రధాన లాభాల్లో ఉండగా, బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, బ్రిటానియా, బీపీసీఎల్ నష్టాల్లో కొనసాగుతోన్నాయి.

ఇంజనీర్స్ ఇండియా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ మరియు రిటైల్, అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ, ఆస్టర్ DM హెల్త్‌కేర్, క్యాంపస్ యాక్టివ్‌వేర్, EIH, ఎక్సికామ్ టెలి-సిస్టమ్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హింద్‌వేర్ హోమ్ ఇన్నోవేషన్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్, MTAR టెక్నాలజీస్, NBCC (ఇండియా), అపీజే సురేంద్ర పార్క్ హోటల్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్, ఆర్ ఆర్ కేబుల్ సహా 440 కంపెనీలు తమ మార్చి త్రైమాసిక ఆదాయాలను మంగళవారం ప్రకటించబోతున్నాయి.


Click it and Unblock the Notifications