Stock Market Open: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఐటీలో ఊపు..
శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతోంది. ఉదయం 11 గంటల 2 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 717 పాయింట్ల పెరిగి 75866 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 233 పాయింట్లు వృద్ధి చెంది 23054 వద్ద ట్రేడవుతోంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ రెపో రేటును ఆశించిన రీతిలో యథాతథంగా ఉంచింది. RBI గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (MPC) బెంచ్‌మార్క్ రెపో రేటును 4:2 మెజారిటీతో వరుసగా ఎనిమిది సారి యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. దీంతో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతోన్నాయి.
బీఎస్ఈ 30 ఇండెక్స్ లో విప్రో, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్ సీఎల్ టెక్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, ఎల్అండ్ టీ, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, రిలయన్స్, ఏసియన్ పెయింట్స్, భారతీ ఎయిర్ టెల్, నెస్లే ఇండియా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, యాక్సెస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఎస్బీఐఎన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాల్లో ఉండగా.. మారుతీ నష్టాల్లో కొనసాగుతోంది.

HDFC AMC, జూలై 1, 2024 నుండి జూన్ 30, 2029 వరకు అమలులోకి వచ్చే మరో 5 సంవత్సరాల కాలానికి నవనీత్ మునోత్‌ను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా తిరిగి నియమించింది.


Click it and Unblock the Notifications