స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతోన్నాయి. ఉదయం 9 గంటల 48 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 176 పాయింట్లు పెరిగి 75586 కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 40 పాయింట్ల వృద్ధి 22,997 ట్రేడవుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఇండెస్ ఇండ్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్, టాటా స్టీల్, ఐటీసీ, జేఎస్ డబ్ల్యూ, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సెస్ బ్యాంక్ లాభాల్లో ట్రేడవుతోంది.
నెస్లే ఇండియా, హెచ్ సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐఎన్, ఇన్ఫోసిస్, టైటాన్, ఏసియన్ పెయింట్స్, టాటా మోటార్స్, రిలయన్స్, ఎల్అండ్ టీ, ఎంఅండ్ఎం, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, మారుతీ, విప్రో నష్టాల్లో కొనాసాగుతోన్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, టీసీఎస్, దీవిస్ ల్యాబ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ఈ రోజు బ్యాంకు స్టాక్ ల్లో అనుకూలత కనిపిస్తోంది. బ్యాంకు స్టాక్ లు లాభాల్లో కొనసాగుతోన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్ స్టాక్ లు లాభాల్లో ట్రేడవుతోన్నాయి.
ఈ వారం చివర్లో రానున్న కీలక ద్రవ్యోల్బణ నివేదికకు ముందు అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపుపై వర్తకులు అంచనా వేయడంతో సోమవారం బంగారం ధరలు పెరిగాయి.


Click it and Unblock the Notifications