Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. రాణిస్తున్న బ్యాంక్ స్టాక్‍లు..
గురువారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతోన్నాయి. ఉదయం 10:34 గంటలకు బీఎస్ఈ సెన్సెక్ 205 పాయింట్లు వృద్ధి చెంది 61,765.93 వద్ద ట్రేడవుతుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 48 పాయింట్లు లాభపడి 18,230 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఎల్&టీ, మారతీ, టీసీఎస్, ఎస్బీఐఎన్, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందూస్థాన్ యూనిలివర్, టైటాన్, టాటా మోటర్స్, ఎం&ఎం, సన్ ఫార్మా నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం లాభాలతో ముగియడంతో ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై పడింది.
భారతీ ఎయిర్ టెల్, ఇండస్ ఇండ్, ఐటీసీ, నెస్లా ఇండియా, రిలయన్స్, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, కొటాక్ మహీంద్రా, ఏసియన్ పెయింట్స్, హెచ్ సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

FMCG మేజర్ ITC, SBI, ఇండిగో, గెయిల్, యునైటెడ్ స్పిరిట్స్, జైడస్ లైఫ్, PI ఇండస్ట్రీస్, కంటైనర్ కార్ప్, యునో మిండా, గ్లాండ్ ఫార్మా, బాటా ఇండియా, రామ్‌కో సిమెంట్స్, ట్రైడెంట్, క్లీన్ సైన్స్ టెక్, PNB హౌసింగ్ ఫైనాన్స్, LT ఫుడ్స్, Divgi TorqTransfer ఈ రోజు మార్చి త్రైమాసిక ఫలితాలను మే 18న ప్రకటించనున్నాయి.

నిన్న ఎఫ్‌ఐఐలు రూ.149 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు రూ.208 కోట్లు విలువ చేసే షేర్లను సేల్ చేశారు. మరోవైపు, HDFC బ్యాంక్‌లో SBI ఫండ్స్ మేనేజ్‌మెంట్‌లో 9.99 శాతం కొనుగోలు చేయడానికి RBI నుండి అనుమతి పొందింది.


Click it and Unblock the Notifications