Stock Market: వచ్చే 10 సంవత్సరాలు స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ఉంటాయట..!
యుఎస్‌లో ద్రవ్యోల్బణం రేటు 8.3 శాతానికి పెరిగింది. అంచనాకు మించి ద్రవ్యోల్భణ రేటు ఉండడంతో మార్కెట్‌లో భయాందోళనలు నెలకొని డౌజోన్స్ 850 పాయింట్లు పడిపోయింది. దీంచో శుక్రవారం నిఫ్టీ 17,525కి పడిపోయింది. స్టాక్ మార్కెట్ పది సంవత్సరాల పాటు ఫ్లాట్‌గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉందని బిలీయనీర్ స్టాన్లీ డ్రుకెన్‌మిల్లర్ అన్నారు.
నాలుగు సార్లు వడ్డీ రేట్లు పెంపు
బలమైన ఉత్పాదకత, ద్రవ్యోల్బణానికి దారితీసిన ప్రపంచీకరణ తిరోగమనం ఒక ముఖ్యమైన మార్పు అని డ్రుకెన్‌మిల్లర్ అన్నారు. 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత వృద్ధిని ప్రోత్సహించడానికి, సెంట్రల్ బ్యాంకులు కూడా సాధారణంగా ద్రవ్య విధానాలను అనుసరించాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, ఫెడ్ 2022లో వడ్డీ రేట్లను నాలుగు సార్లు పెంచిందని చెప్పారు.

యుద్ధం కారణంగా
మళ్లీ పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది జూలైలో దాని బెంచ్‌మార్క్ వడ్డీ రేటుకు మరో ."75 బేసిస్ పాయింట్‌ను జోడించింది. సెంట్రల్ బ్యాంక్ 2022లో పెంచడం ఇది నాల్గో పెంపు. 1980ల చివరి నుంచి, ఇంత త్వరగా లేదా ఇంత ముఖ్యమైన రేటు పెంపుదల జరగలేదు"అని చెప్పారు.
రష్యా, ఉక్రేయిన్ యుద్ధం కారణంగా, మహమ్మారి మరియు ప్రపంచం ఎలా స్పందించింది, తరువాతి ఆరు నుండి 12 నెలల్లో మార్కెట్ ఎలా కదులుతుందో అంచనా వేయడం గతంలో కంటే చాలా కష్టమని డ్రకెన్‌మిల్లర్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications