స్టాక్ మార్కెట్‌ టుడే.. దలాల్ స్ట్రీట్‌లో బుల్స్ హవా.. నిఫ్టీ జోరును నడిపిస్తున్న 4 కీలక అంశాలు ఇవే..

Stock Market Today: బుధవారం నాటి భారీ ర్యాలీ తర్వాత గురువారం (నవంబర్ 26, 2026) కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్స్ జోరు కొనసాగుతోంది. ఉదయం 8 గంటల సమయంలో గిఫ్ట్ నిఫ్టీ (GIFT Nifty) సుమారు 131 పాయింట్ల లాభంతో ట్రేడవడం ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపగా, ప్రత్యక్ష మార్కెట్ ప్రారంభమైన తర్వాత నిఫ్టీ 50 సూచీ ఒడిదుడుకుల నడుమ ఉదయం 10 గంటల సమయానికి 32 పాయింట్ల లాభంతో 25,851.90 వద్ద, ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో 130 పాయింట్ల స్థాయికి ఎగబాకుతూ కదలాడింది.

ఈ సానుకూల మార్కెట్ ర్యాలీ వెనుక ప్రధానంగా నాలుగు కీలక అంశాలు దోహదపడుతున్నాయి. విదేశీ, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల భారీ కొనుగోళ్లు స్టాక్ మార్కెట్ కి ఊపునిచ్చింది. నవంబర్ నెలలో నిరంతరంగా పెట్టుబడులు పెడుతున్న విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం ఒక్కరోజే రూ. 4,479 కోట్ల విలువైన భారత ఈక్విటీలను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) సైతం రూ. 4,018 కోట్ల పెట్టుబడులు పెట్టడం మార్కెట్‌కు బలమైన అండగా నిలిచింది.

Nifty today stock market live update Nifty jumps 130 points Sensex today Indian stock market November 26 2026 why stock market is rising FII buying IT stocks rally banking stocks Nifty 50 live share market news 130 50

అలాగే గురువారం ఉదయం జపాన్ నిక్కీ 225 సూచీ 1.6 శాతం, దక్షిణ కొరియా కోస్పి 1.9 శాతం మేర లాభపడటం భారత మదుపర్లలో సానుకూల సెంటిమెంట్‌ను పెంచింది.ఇక అమెరికా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు నిలిచాయి. గత సెషన్‌లో తీవ్ర ఒడిదుడుకుల తర్వాత అమెరికా సూచీలు కనిష్ఠ స్థాయిల నుండి కోలుకోగా, డౌ జోన్స్ 0.33 శాతం లాభంతో ముగిసింది. గురువారం ఉదయం అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ సైతం లాభాల్లో ట్రేడవడం ఆసియా మార్కెట్లకు ఊతమిచ్చింది.

Also Read

ఇక విదేశీ నిధుల ప్రవాహంతో భారత రూపాయి బుధవారం 40 పైసలు బలపడి డాలర్‌తో పోలిస్తే 92.24 స్థాయికి చేరుకోవడంతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో కొనసాగుతున్న కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. రాబోయే సెషన్లలో మార్కెట్ దిశను పరిశీలిస్తే.. నిపుణుల అంచనా ప్రకారం నిఫ్టీకి 25,800 స్థాయి* కీలక మద్దతుగా (Support), 26,000-26,100 స్థాయిలు ప్రధాన నిరోధంగా (Resistance) పనిచేయనున్నాయి.

నిఫ్టీ 26,100 పైన నిలదొక్కుకుంటే ర్యాలీ మరింత విస్తరించే అవకాశం ఉంది. అయితే మరోవైపు అమెరికా ప్రతిపాదించిన వాణిజ్య సుంకాలు, ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, గ్లోబల్ టెక్నాలజీ షేర్లలో నెలకొన్న బలహీనత మార్కెట్‌కు అప్రమత్తత అవసరమని సూచిస్తున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ఆసియా మార్కెట్ల రికవరీ, రూపాయి బలోపేతం, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు భారత స్టాక్ మార్కెట్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే ఈ ర్యాలీ కొనసాగుతుందా లేదా అన్నది తదుపరి ట్రేడింగ్ సెషన్లలో కొనుగోళ్ల బలంపై ఆధారపడి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+