కరోనా వైరస్ లాక్ డౌన్ తో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని ఒడిదుడుకులకు లోనైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇప్పుడు కాస్త కుదుటపడుతున్నాయా అనిపిస్తుంది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా లాభాల్లో ముగిశాయి. గురువారం ట్రేడింగ్ ముగిసేసరికి దేశీయ సెన్సెక్స్ 32 వేల పాయింట్ల మార్కును దాటి రెండో రోజు ర్యాలీ కొనసాగించింది . వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు జోరు చూపించటంతో కాస్త ట్రేడింగ్ లో కాస్త జోష్ వచ్చింది.

32,000 పాయింట్ల మార్క్‌ను దాటిన సెన్సెక్స్
నిన్న 1,000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ తాజాగా మరో 595 పాయింట్లు బలపడింది. వెరసి 32,000 పాయింట్ల మార్క్‌ను దాటింది సెన్సెక్స్ . 32,200 వద్ద నేడు ట్రేడింగ్ ముగిసింది . నిఫ్టీ సైతం 175 పాయింట్లు ఎగసి 9,500కు చేరువలో 9,490 వద్ద క్లోజ్ అయ్యింది . ఇక ఇంట్రాడే లో సెన్సెక్స్ 32,267 వద్ద గరిష్టాన్ని తాకగా.. 31,642 సమీపంలో కనిష్టానికి చేరింది. ఇక నిఫ్టీ ఒక దశలో 9,511 పాయింట్ల వద్ద గరిష్టాన్ని అందుకోగా.. 9,337 దిగువకు చేరింది.

ఆర్ధిక వ్యవస్థ ఏడాది ద్వితీయార్థం నుండి గాడిలో పడుతుందన్నఅంచనాలతో జోష్
కరోనా లాక్ డౌన్ తో దెబ్బ తిన్న ఆర్ధిక వ్యవస్థ ఏడాది ద్వితీయార్థం నుంచీ గాడిలో పడతాయన్న అంచనాలు ప్రపంచస్థాయిలో ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు .ఇక అంతేకాకుండా మే నెల డెరివేటివ్ సిరీస్ చివరి రోజు సైతం ట్రేడర్లు షార్ట్ కవరింగ్ చేపట్టడంతో ఇండెక్సులు బేర్ ర్యాలీ చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. పలు దేశాలలో లాక్ డౌన్ ఎత్తివేస్తుండటం అన్ని వ్యాపారాలకు వెసులుబాటు కలుగుతుండటం కూడా మార్కెట్ కు బూస్ట్ ఇస్తుంది.

ఈ రోజు ట్రేడింగ్ ఆరంభం నుండి లాభాల బాటే
ఇక ఈ రోజు ఆరంభంనుంచి లాభాలతో మురిపించిన సూచీలురోజంతా అదే ధోరణిని కొనసాగించాయి. ముఖ్యంగా బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా, మెటల్ సూచీలు 2-3 శాతం పెరిగాయి. బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు జోరుగా కనిపించాయి. అటు డాలరు మారకంలో రూపాయి బలహీనంగాముగిసింది.గత ముగింపు 75.72 తో పోలిస్తేగురువారం 75.75 వద్ద ముగిసింది.లాక్‌డౌన్ కాలంలో నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ ఇండెక్స్‌లు నష్టాలను చవిచూడలేదని ఏస్‌ఈక్విటీ గణాంకాలు చెబుతున్నాయి.

బ్యాంక్, ఫైనాన్షియల్ ఇండెక్స్‌ల ర్యాలీ .. టాప్ గెయినర్ ఐషర్ మోటార్స్
విచిత్రంగా ఈ సమయంలోనే ఊహించని విధంగా ఈ ఇండెక్స్‌లు చెప్పుకోదగిన ర్యాలీని చేశాయి. లాక్‌డౌన్‌ను విధించిన నాటి నుంచి నిన్నటి(మే 27) వరకు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 9శాతం ర్యాలీ చేశాయి. ఇదే సమయంలో వీటి బెంచ్‌మార్క్ ఇండెక్స్ 19శాతం పెరిగింది. ఇక ఫైనాన్షియల్ హెవీవెయిట్స్ హెచ్ డీఎఫ్సీ బ్యాంక్,యాక్సిస్ బ్యాంక్,కోటక్ మహీంద్రా,ఐసీఐసీఐ బ్యాంక్ ఈ రోజుట్రేడింగ్ లో భారీగా లాభపడ్డాయి.ఐషర్ మోటార్స్టాప్ గెయినర్ గా నిలిచింది . జీ, హీరో మోటోకార్ప్,ఎల్ అండ్ టీ,బ్రిటానియాకూడా లాభపడ్డాయి. మరోవైపు భారతి ఎయిర్టెల్,ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా,హిందుస్తాన్ యూనిలీవర్,బీపీసీఎల్, ఐటీసీ,విప్రో, టీసీఎస్ లు నష్టపోయాయి.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications