స్టాక్ మార్కెట్స్ కళకళ..బుల్ జోష్: భారీ లాభాల్లో షేర్స్
cప్రారంభంలోనే 800 పాయింట్ల మేర లాభపడింది సెన్సెక్స్. 55,700 వద్ద ట్రేడింగ్ ఆరంభమైంది. తొలిగంటలో గరిష్ఠంగా 55,829 పాయింట్ల వరకు వెళ్లింది. నిఫ్టీ 50 కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లాభపడింది. 218.55 పాయింట్లతో ట్రేడింగ్ ఆరంభమైంది. తొలి గంట మొత్తం ఇదే రేంజ్‌లో ట్రేడింగ్ కొనసాగింది. తొలిగంటలో 16,571 పాయింట్ల వద్ద ట్రేడ్ అయంది. సెన్సెక్స్, నిఫ్టీ.. భారీగా లాభాల్లో దూసుకెళ్లడం.. ఇన్వెస్టర్లలో జోష్ నింపింది.
తొలి గంటలో ఐటీ షేర్లు జోరందుకున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రతో పాటు అల్ట్రాటెక్ సిమెంట్స్, టైటాన్ కంపెనీ షేర్లు గెయిన్ అయ్యాయి. ఫార్మాసూటికల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్ సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లు ఫర్వాలేదనిపించుకున్నాయి. బ్యాంకింగ్ షేర్లు సైతం లాభాల్లో కనిపించాయి. మహీంద్ర అండ్ మహీంద్ర, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.

ఇదే జోష్ ఇంట్రాడే మొత్తం కొనసాగుతుందా? లేదా అనేది ఉత్కంఠతగా మారింది. తొలి గంటలోనే సెన్సెక్స్.. ఏకంగా 1,000 పాయింట్ల వరకు వెళ్లడం వల్ల అదే ఊపు ఉంటుందనిమార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. మార్కెట్‌లో అన్ని సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లు అప్పర్ సర్క్యుట్‌లో ట్రేడ్ అవుతుండటం శుభసూచకంగా పరిగణిస్తున్నాయి.


Click it and Unblock the Notifications