ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం తొలి రోజు లాభాలతో ఆరంభమైంది. స్టాక్స్ అన్నీ గ్రీన్‌జోన్‌లో ట్రేడింగ్ అవుతూ కనిపించాయి. 250 పాయింట్ల లాభంతో షేర్ మార్కెట్ ప్రారంభమైంది గానీ.. ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. కొద్దిసేపటికే డౌన్‌ఫాల్ రికార్డయింది. అన్ని ప్రధాన ఇండైసీస్‌కు చెందిన షేర్ల గ్రాఫ్ నేల చూపులు చూసింది. లోయర్ సర్క్యుట్‌లోకి చేరింది. ఇంట్రాడే ట్రేడింగ్ కాస్త మెరుగ్గా ఉండొచ్చనే అంచనాలు సైతం లేకపోలేదు.
ప్రారంభంలోనే 200 పాయింట్ల మేర లాభపడింది సెన్సెక్స్. 54,600 పాయింట్లను దాటుకుంది. తొలిగంటలో గరిష్ఠంగా 54,646.8 పాయింట్ల వరకు వెళ్లింది. అక్కడి నుంచి మళ్లీ క్షీణించడం మొదలు పెట్టింది. 54,542.66 పాయింట్లకు దిగజారింది. దీనితో దాదాపు అన్ని సెగ్మెంట్స్‌కు చెందిన షేర్ల ధరలు పడిపోయాయి. మైనస్‌లో ట్రేడ్ అవుతూ కనిపించాయి. రెడ్ జోన్‌లో జారిపోయాయి. రెండో గంట ఆరంభంలో కొద్దిసేపటికే మళ్లీ సెన్సెక్స్ పుంజుకొంది. 54,679.49 పాయింట్లకు చేరుకుంది. మొత్తంగా 355.65 పాయింట్ల మేర లాభపడింది.

నిఫ్టీ 50 కూడా పెద్దగా లాభపడలేదు. 50 పాయింట్లతో ఇవ్వాళ నిఫ్టీ 50 ట్రేడింగ్ ఆరంభమైంది. తొలిగంటలో 16,290 పాయింట్లతో ట్రేడింగ్ ఆరంభమైంది. అది ఎంతో సేపు నిలవలేదు. 16,226 పాయింట్లకు క్షీణించింది. ఆ తరువాత మళ్లీ ఒక్కసారిగా పైకెగిసింది నిఫ్టీ 50 గ్రాఫ్. రెండో గంటలో 16,344.65 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్, నిఫ్టీ.. మరింత దిగజారకపోవడం ఇన్వెస్టర్లను ఊపిరి పీల్చుకునేలా చేసింది. తొలి గంటలో ఫార్మాసూటికల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్ సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లు కొంతమేర నష్టపోయాయి.
తొలి గంటలో టాటా స్టీల్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో, మారుతి సుజుకి స్టాక్స్ తొలిగంటలో టాప్ గెయినర్స్‌గా రిజిస్టర్ అయ్యాయి. ఇంట్రాడే మొత్తంగా సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడింగ్‌లో హెచ్చుతగ్గులు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications