స్టాక్ మార్కెట్స్‌కు ఆర్బీఐ రివ్యూ భయం: ఒక్కరోజు ముందు నష్టాలపాలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవ్వాళ నష్టాలతో ముగిశాయి. మెజారిటీ స్టాక్స్ నష్టాల బారిన పడ్డాయి. లోయర్ సర్క్యుట్‌లో ట్రేడ్ అయ్యాయి. ఈ ఉదయం నుంచీ ఇదే పరిస్థితి నెలకొంది. 500 పాయింట్లకు పైగా నష్టాలతో షేర్ మార్కెట్స్ కార్యకలాపాలు ఆరంభం అయ్యాయి. అదే రేంజ్‌లో ముగిశాయి. ఎక్కడే గానీ నిలదొక్కుకోలేదు. మధ్యాహ్నం క్లోజింగ్ సమయానికి నష్టాలు మరింత పెరిగాయి.

ఎంపీసీ రివ్యూ నేపథ్యంలో..
అన్ని ప్రధాన సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లన్నీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశం బుధవారం ముగియనుంది. అదేరోజు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తన ఎంపీసీ పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. 40 నుంచి 50 బేసిస్ పాయింట్ల మేర రేట్లను పెంచుతుందంటూ ఆర్థికవేత్తలు అంచనాలు వేస్తోన్న వేళ.. దాని దుష్ప్రభావం మార్కెట్స్‌పై పడినట్టయింది.

567 పాయింట్లు నష్టాల్లో..
మధ్యాహ్నం 3:30 గంటలకు బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో 55,107 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. సోమవారం నాటి క్లోజింగ్ ట్రేడింగ్‌తో పోల్చుకుంటే 567 పాయింట్లను మార్కెట్స్ నష్టపోయాయి. నిఫ్టీదీ కూడా అదే పరిస్థితి. 153 పాయింట్ల నష్టాన్ని చవి చూసింది. 16,416 పాయింట్ల వద్ద దీని ట్రేడింగ్ ముగిసింది.

బెంచ్‌మార్క్ సెగ్మెంట్స్..
అన్ని బెంచ్‌మార్క్ ఇండైసెస్ అన్నీ లోయర్ సర్కుట్‌లో ట్రేడ్ అయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ గరిష్ఠంగా 793 పాయింట్ల వరకు నష్టపోయింది. ఆ తరువాత కొంతవరకు రికవరీ కాగలిగింది. ఐటీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, స్టీల్, బ్యాంకింగ్, సిమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్.. సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లు నష్టపోయాయి.

నష్టపోయిన షేర్లు ఇవే..
ఆసియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫైన్‌సర్వ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, నెస్ట్లె, లార్సెన్ అండ్ టుబ్రో, హిందుస్తాన్ యూనీలీవర్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర.. సెన్సెక్స్‌లో అత్యధికంగా నష్టపోయిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. 4 నుంచి 5 శాతం మేర వాటి షేర్ల ధరలు క్షీణించాయి.

లాభపడ్డ షేర్లు ఇవే..
టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్ర అండ్ మహీంద్ర, కోటక్ మహీంద్ర కొంతవరకు లాభపడ్డాయి. ఈ లాభాల శాతం ఒకటి కంటే తక్కువే. నిఫ్టీ ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లు గ్రీన్‌జోన్‌లో ట్రేడ్ అయ్యాయి.. లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, మారుతి సుజుకి, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, బీపీసీఎల్ స్వల్పంగా లాభాలను చవి చూశాయి.


Click it and Unblock the Notifications