స్టాక్ మార్కెట్స్ ఢమాల్: నష్టాల్లో టాప్ సెగ్మెంట్స్: ఐటీ సహా
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం తొలిరోజు నష్టాలతో ఆరంభమైంది. మెజారిటీ స్టాక్స్ నష్టాలబారిన పడ్డాయి. లోయర్ సర్క్యుట్‌లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఉదయం 150 పాయింట్లకు పైగా నష్టాలతో షేర్ మార్కెట్స్ కార్యకలాపాలు ఆరంభం అయ్యాయి. ఆ తరువాత కొంత రికవరీ అయింది..గానీ నిలదొక్కుకోలేదు. నష్టాలు మరింత పెరిగాయి. ఒకదశలో 200 పాయింట్లను టచ్ చేసింది. అన్ని ప్రధాన సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లన్నీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
వారం తొలిరోజే నష్టాలను చవి చూడాల్సి రావడం వల్ల ఇన్వెస్టర్లకు ఉసూరుమనిపించింది. ఐటీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, స్టీల్.. సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లు నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది. శుక్రవారం నాడు కనిపించిన మార్కెట్ క్యాప్‌ను కొంతమేర కోల్పోయింది. తొలిగంటలోనే సెన్సెక్స్ 55,662 పాయింట్లతో టరేడింగ్ ఆరంభమైంది. కొద్దిసేపటికి గ్రాఫ్ కొంత పైకి ఎగబాకినప్పటికీ మళ్లీ కిందికి దిగింది. 55,560.98 వద్ద ట్రేడింగ్ నమోదు చేసుకుంది.

కనిష్ఠంగా 382 పాయింట్ల నష్టంతో 55,386 పాయింట్ల వద్దకు పడింది సెన్సెక్స్. నిఫ్టీ 50 కూడా అదే స్థితిలో కనిపించింది. 116 పాయింట్ల నష్టంతో దీని ట్రేడింగ్ ఆరంభమైంది. తొలి గంటలో 16,557 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో వంటి ఐటీ షేర్లు దెబ్బతిన్నాయి. 3.09 శాతం మేర వాటి స్టాక్స్ రేట్లు తగ్గాయి. వాటితో పాటు ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్‌కు చెందిన హిందుస్తాన్ లీవర్ లిమిటెడ్, ఐటీసీ స్టాక్స్ ధరలు పడిపోయాయి.
బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఆసియన్ పెయింట్స్ షేర్లు రెండుశాతం మేర క్షీణించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు కూడా ఇవ్వాళ నష్టాలబారిన పడ్డాయి. తొలిగంట ముగిసే సమయానికి ఒక్కో షేర్ ధర రూ.5.80 పైసల నష్టంతో ట్రేడ్ అయింది. మరింత దిగజారడం కనిపించింది. ఇంట్రాడే ట్రేడింగ్ మొత్తం ఇలాగే ఉండొచ్చంటూ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. సౌదీ అరేబియా క్రూడాయిల్ రేట్లను పెంచడం, రిటైల్ ద్రవ్యోల్బణం.. మార్కెట్‌ను ప్రభావితం చేస్తోన్నాయని చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications