శుభప్రదంగా..శుక్రవారం: స్టాక్ మార్కెట్స్‌లో బుల్ జోష్: లాభాల్లో ఐటీ షేర్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం చివరి రోజు లాభాలతో ఆరంభమైంది. మెజారిటీ స్టాక్స్ అన్నీ గ్రీన్ జోన్‌లో ట్రేడ్ అవుతున్నాయి. అప్పర్ సర్క్యుట్‌లో ఉన్నాయి. ఈ ఉదయం 500 పాయింట్లకు పైగా లాభాలతో షేర్ మార్కెట్స్ కార్యకలాపాలు ఆరంభం అయ్యాయి. ఆ తరువాత దీని గ్రాఫ్ పైపైకి వెళ్లింది. 550 పాయింట్లను టచ్ చేసింది. అన్ని ప్రధాన ఇండైసీస్‌కు చెందిన షేర్లన్నీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలాగే ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
తొలిగంటలోనే సెన్సెక్స్ 56,000 మార్క్‌ను అందుకుంది. 56,357.11 వద్ద ట్రేడింగ్ నమోదు చేసుకుంది. నిఫ్టీ 50 కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లాభపడింది. 100 పాయింట్ల మేర లాభంతో ట్రేడింగ్ ఆరంభమైంది. తొలి గంట మొత్తం ఇదే రేంజ్‌లో ట్రేడింగ్ కొనసాగింది. తొలిగంటలో 16,757.80 పాయింట్ల వద్ద ట్రేడ్ రికార్డ్ చేసింది. సెన్సెక్స్, నిఫ్టీ- చెప్పుకోదగ్గ స్థాయిలో లాభాల్లో దూసుకెళ్లడం.. ఇన్వెస్టర్లలో జోష్ నింపింది.

తొలి గంటలో ఐటీ షేర్లు జోరందుకున్నాయి. టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి ఐటీ షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ షేర్ల రేట్లు సైతం దూసుకెళ్లాయి. సిమెంట్స్ సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లు మాత్రం క్షీణించాయి. అల్ట్రాటెక్ సిమెంట్స్, శ్రీసిమెంట్స్‌తో పాటు బ్రిటానియా, గ్రాసిమ్, అపోలో హాస్పిటల్స్, రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్స్ షేర్ల ధరలు నేల చూపులు చూశాయి.
ఫార్మాసూటికల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్ సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లు ఫర్వాలేదనిపించుకున్నాయి. బ్యాంకింగ్ షేర్లు సైతం లాభాల్లో కనిపించాయి. ఇదే జోష్ ఇంట్రాడే మొత్తం కొనసాగుతుందా? లేదా అనేది ఉత్కంఠతగా మారింది. తొలి గంటలోనే సెన్సెక్స్.. 600 పాయింట్ల వరకు వెళ్లడం వల్ల అదే ఊపు ఉంటుందనిమార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఈ వారం చివరి రోజు మార్కెట్‌లో అన్ని సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లు అప్పర్ సర్క్యుట్‌లో ట్రేడ్ అవుతుండటం వల్ల ఇన్వెస్టర్ల సందడి నెలకొంది.


Click it and Unblock the Notifications