ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్స్ నష్టాల బారి నుంచి కోలుకోలేకపోతున్నాయి. ఇవ్వాళ కూడా నష్టాలతో ముగిశాయి. వరుసగా మూడోరోజూ తేరుకోలేదు. ప్రధాన సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లు నష్టాల్లోనే ట్రేడింగ్ అయ్యాయి. కిందటి రోజుతో పోల్చుకుని చూస్తే నష్టాల శాతం మక్కీ కి మక్కీగా కనిపించింది. ఇంట్రాడే ట్రేడింగ్- లాభనష్టాల మధ్య ఊగిసలాడింది. నష్టాలతో ప్రారంభమై.. మధ్యలో లాభాల్లోకి వెళ్లి మరీ.. దిగజారింది.
కిందటి రోజు సెన్సెక్స్ 52,693.57 పాయింట్ల వద్ద మార్కెట్స్ ముగిశాయి. ఈ ఉదయం అంతకంటే దిగువకే అంటే 52,622 పాయింట్లతో ట్రేడింగ్ ఆరంభమైంది. కొద్దిసేపటికే పైపైకి ఎగబాకింది. గరిష్ఠంగా 52,843.60 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. అది కొద్దిసేపు మాత్రమే. ఆ తరువాత మళ్లీ నేలచూపులు క్షీణించింది.

ఇంకాస్సేపట్లో ట్రేడింగ్ ముగుస్తుందనగా.. కనిష్ఠానికి పతనమైంది. 52,513.35 పాయింట్లకు దిగజారింది. చివరిగా 52,514.39 పాయింట్ల వద్ద సెన్సెక్సె ట్రేడింగ్ ముగిసింది. నిఫ్టీ 50దీ అదే తీరు. నష్టాలతోనే ఆరంభమైంది.. లాభాల్లోకి వెళ్లింది.. మళ్లీ క్షీణించింది. కిందటి రోజుతో పోల్చుకుంటే ఫ్లాట్‌గా ఈ ఉదయం నిఫ్టీ ట్రేడింగ్ మొదలైంది. ఆ తరువాత ఇంట్రాడే హయ్యెస్ట్‌గా 15,778.15 పాయింట్ల వరకూ వెళ్లింది. మళ్లీ పతనమైంది. 39.95 పాయింట్ల నష్టంతో 15,692.15 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించుకుంది.
అత్యధికంగా బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్స్, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ అండ్ టుబ్రో, ఏసియన్ పెయింట్స్ లాభపడ్డాయి. సెన్సెక్స్‌లో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. వాటి షేర్ల ధరలు 1 నుంచి 4 శాతం వరకు పెరిగాయి. ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, హిందుస్తాన్ యూనిలివర్, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నష్టపోయాయి. ఒకశాతం వరకు వాటి షేర్ల రేట్లు తగ్గాయి.
టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒకటైన టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్ల ధరలు ఇవ్వాళ భారీగా పడిపోయాయి. 52 వారాల కనిష్ఠానికి క్షీణించాయి. ఇవ్వాళ మధ్యాహ్నం వరకు ఏడున్నర శాతం వరకు టాటా కమ్యూనికేషన్స్ షేర్ల ధరల్లో పతనం కనిపించింది. మరింత తగ్గొచ్చనే అంచనాలు మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తమౌతోన్నాయి.
ఈ ఉదయం రూ.920.45 పైసల వద్ద ట్రేడింగ్ ఆరంభమైన తరువాత మరింత దిగజారాయి. 800 రూపాయల కంటే దిగువకు పడిపోయాయి. ట్రేడింగ్ మొదలైన 10 నిమిషాల్లోనే గరిష్ఠంగా 869.05 పైసలకు చేరింది. ఆ తరువాత కొద్దిగా పుంజుకొంది గానీ.. మంగళవారం నాటి క్లోజింగ్ ప్రైస్‌ను అందుకోలేకపోయింది. రూ.877.45 పైసల వద్ద ట్రేడ్ అయింది. ఒక్కో షేర్ మీద 43 రూపాయల మేర నష్టాన్ని పంచింది.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications