ముంబై: స్టాక్ మార్కెట్ కిందటివారం భారీ నష్టాలతో ముగిసింది. 1,016.84 పాయింట్ల మేర నష్టంతో శుక్రవారం ట్రేడింగ్‌ను ముగించుకుంది. గురువారం మినహా.. మిగిలిన అన్ని రోజులూ బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో షేర్ల ధరలు భారీగా తగ్గాయి. ఫలితంగా నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరయింది.

వెయ్యి పాయింట్లకు పైగా..
ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనివిధంగా శుక్రవారం ట్రేడింగ్ కనిపించింది. వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోవడం అంటే మాటలు కాదు. దాదాపుగా అన్ని సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లన్నీ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఆటొమొబైల్, ఐటీ, రియాల్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్.. ఇలా దాదాపు అన్ని రంగాల షేర్ల ధరలు పతనం అయ్యాయి.

ఆ షేర్లు ఇవే..
కొన్ని షేర్లను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం అంటూ మార్కెట్ నిపుణులు సూచిస్తోన్నారు. ఈ స్లంప్ సమయంలో నిపుణులు సూచించిన షేర్లు కూడా భారీగా తగ్గాయి. అవి తగ్గడం వల్ల వాటిని కొనుగోలు చేయొచ్చని నిపుణులు స్పష్టం చేస్తోన్నారు. భవిష్యత్తులో అవి ఖచ్చితంగా పెరుగుతాయని జోస్యం చెబుతున్నారు. అవే- ఫెడరల్ బ్యాంక్, ఒబెరాయ్ రియాల్టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు.

రూ.120 వరకూ..
ఫెడరల్ బ్యాంక్ షేర్ ధర రూ.91.90 పైసల వద్ద ముగిసింది. రూ.90.40 పైసల వద్ద ట్రేడింగ్ ఆరంభమైంది. అదే రోజు గరిష్ఠంగా రూ.90,50 పైసలకు పడిపోయింది గానీ.. మళ్లీ పైపైకి ఎగబాకింది ఫెడరల్ బ్యాంక్ షేర్ ధరల గ్రాఫ్. రూ.91.90 పైసల వద్ద ట్రేడింగ్ ముగించుకుంది. ఈ వారం దీని రేటు మరింత పెరగొచ్చని, టార్గెట్ ధర 120 రూపాయల వరకు ఉందని మార్కెట్ నిపుణులు సూచించారు.

ఒబెరాయ్ రియాల్టీ..
ఒబెరాయ్ రియాల్టీ షేర్ల ధరలు కూడా ఓ మోస్తరుగా తగ్గాయి. శుక్రవారం నాడు 775 రూపాయల వద్ద ట్రేడింగ్ ఆరంభమైన అనంతరం ఇది భారీగా పెరిగింది. ఒక దశలో 800 రూపాయల వరకు ట్రేడింగ్ నమోదు చేసుకుంది. చివరికి రూ.794.85 పైసల వద్ద ట్రేడింగ్ ముగించుకుంది. దీని టార్గెట్ ధర 1,000 రూపాయలు. త్వరలోనే ఇది వెయ్యి రూపాయల మార్క్‌ను అందుకుంటుందని అంచనా వేశారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. షేర్ల ధరలు కూడా మార్కెట్‌లో స్లంప్‌కు అనుగుణంగా తగ్గాయి. శుక్రవారం నాడు 1,360 రూపాయల వద్ద ట్రేడింగ్ ఆరంభమైన అనంతరం ఇది భారీగా తగ్గింది. ఒక దశలో రూ.1,346.55 పైసల వరకు ట్రేడింగ్ నమోదు చేసుకుంది. చివరికి రూ.1,348.75 పైసల వద్ద ట్రేడింగ్ ముగించుకుంది. దీని టార్గెట్ ధర 1,750 రూపాయలు.

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్..
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. షేర్ల ధరలదీ ఇదే పరిస్థితి. ఈ దిగ్గజ కంపెనీ షేర్ల ధరలు కూడా తగ్గాయి. శుక్రవారం నాడు రూ. 1,017.60 పైసల వద్ద ట్రేడింగ్ ఆరంభమైన అనంతరం ఇది భారీగా తగ్గింది. ఒక దశలో రూ.1,008.95 పైసల వరకు ట్రేడింగ్ నమోదు చేసుకుంది. చివరికి రూ.1,019.90 పైసల వద్ద ట్రేడింగ్ ముగించుకుంది. దీని టార్గెట్ ధర 1,348 రూపాయలు.


Click it and Unblock the Notifications