Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఒత్తిడిలో ఐటీ స్టాక్స్..
మంగళవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 445 పాయింట్లు పెరిగి 58,074 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 119 పాయింట్లు వృద్ధి చెంది 17,107 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రా టెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, హెచ్ డీఎఫ్ సీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ, ఎస్బీఐఎన్, టాటా మోటర్స్, భారతీ ఎయిర్ టెల్, టాటా స్టీల్, మారుతి లాభాల్లో ముగిశాయి.
విప్రో, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, హెచ్ సీఎల్ టెక్, ఐటీసీ, ఎం అండ్ ఎం, ఎసియన్ పేయింట్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలివర్, పవర్ గ్రిడ్ నష్టాల్లో ముగిశాయి. అమెరికా, యూరప్ లో బ్యాంకుల్లో ఇబ్బంది ఉండడంతో ఐటీ కంపెనీల్లో కాస్త ఒత్తిడి నెలకొంది. అందుకే ఐటీ స్టాక్ ల్లో తగ్గుదల నమోదు అయింది.

ప్రైవేట్ బ్యాంక్ IDFC ఫస్ట్ బ్యాంక్ షేర్లు 1.38 శాతం పెరిగి రూ.55.05కి చేరుకున్నాయి. మాతృ సంస్థ ఐడిఎఫ్‌సి లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన యూనిట్‌తో విలీనాన్ని పూర్తి చేయాలనే నిర్ణయించడంతో స్టాక్ పెరిగింది. విలీనానికి సంబంధించి దశలను పూర్తి చేస్తామనిIDFC తెలిపింది. అటు IDFC లిమిటెడ్ షేర్లు కూడా NSEలో 2.61 శాతం పెరిగి రూ.78.60 వద్ద ట్రేడవుతున్నాయి. ప్రైవేట్ బ్యాంకింగ్ స్థలంలో, బ్రోకరేజ్ హౌస్ ICICI డైరెక్ట్ IDFC ఫస్ట్ బ్యాంక్‌పై సానుకూలంగా ఉంది. ఇది రాబోయే కొద్ది నెలల్లో మెరుగైన పనితీరును కనబరుస్తుందని అంచనా వేసింది.


Click it and Unblock the Notifications