Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఫార్మా స్టాక్‍ల్లో ర్యాలీ..
బుధవారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 139 పాయింట్లు లాభపడి 58,214 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 17,151 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్ ఇండెక్స్ 30లో బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్, టీసీఎస్, విప్రో, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, రిలయన్స్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, పవరి గ్రిడ్, హెచ్ డీ ఎఫ్ సీ లాభాల్లో ముగిశాయి.
యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఏసియన్ పేయింట్స్, నెస్లే ఇండియా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఎన్టీపీసీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐఎన్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, హెచ్ సీఎల్ టెక్ , ఎన్టీపీసీ నష్టాల్లో స్థిరపడ్డాయి. Credit Suisse రెస్క్యూ తర్వాత బ్యాంకింగ్ సంక్షోభం మరింత సడలించడంతో, US ఫెడరల్ రిజర్వ్ రేటు నిర్ణయానికి ముందు భారతీయ షేర్లు బుధవారం పెరిగాయి.

ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, ఎఫ్‌ఎంసిజి అత్యధికంగా పెరగడంతో చాలా రంగాల సూచీలు గ్రీన్‌లో ముగియగా, మెటల్, రియల్టీ, మీడియా నేటి సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. HDFC లైఫ్‌తో పాటు బజాజ్ ట్విన్స్ (బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్) లాభాల్లో ముగిశాయి. BPCL, NTPC, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్ ఒక్కొక్కటి ఒక శాతం కంటే ఎక్కువ నష్టపోయాయి. బుధవారం తరువాత ఫెడరల్ రిజర్వ్ వడ్డీ-రేటు నిర్ణయించనున్నారు. జపాన్ ఆర్థిక స్టాక్‌లు బుధవారం నాడు గ్లోబల్ ర్యాలీలో చేరాయి.


Click it and Unblock the Notifications