Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రియల్టీలో దూకుడు..!
గురువారం స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 143 పాయింట్లు పెరిగి 59,832 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 17,599 వద్ద స్థిరపడింది. ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించడంతో బ్యాంక్ స్టాక్ ల్లో ర్యాలీ కొనసాగింది. నిఫ్టీ పీఎస్ యూ బ్యాంక్ 0.33 శాతం పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ 0.1 శాతం పెరిగింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.71 శాతం పెరిగింది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ 0.70 శాతం వృద్ధి చెందింది.
బీఎస్ఈ 30 ఇండెక్స్ లో బజాజ్ ఫినాన్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్,ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, ఎంఅండ్ఎం, ఎస్బీఐఎన్, ఎల్ఆండ్ టీ, హెచ్ డీ ఎఫ్ సీ, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్, మారుతీ, రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ, కొటక్ మహీంద్ర బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏసియన్ పేయింట్స్ లాభాల్లో ముగిశాయి.

ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, టాటా స్టీల్, టీసీఎస్, హిందుస్థాన్ యూనిలివర్, విప్రో, టైటాన్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్, హెచ్ సీఎల్ టెక్నాలజీ నష్టాల్లో ముగిశాయి.
సెక్టోరల్ ఇండెక్స్‌లలో, రియల్టీ దాదాపు 3% పెరిగింది. ఆటో, మెటల్, ఫార్మా, ఎనర్జీ లాభాలతో ముగిశాయి. ఐటీ స్వల్ప లాభాల్లో ఉండగా.. ఎఫ్‌ఎంసిజి, కన్స్యూమర్ డ్యూరబుల్ కూడా నష్టాల్లో ముగిశాయి. శుక్రవారం గుడ్ ఫ్రైడే కావడంతో స్టాక్ మార్కెట్లు పనిచేయవు.


Click it and Unblock the Notifications