Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
గురువారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 47 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 213 పాయింట్ల పెరిగి 71870 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 66 పాయింట్ల పెరిగి 21,685 వద్ద ట్రేడవుతోంది.
బీఎస్ఈ 30 ఇండెక్స్ బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్, ఇండస్ ఇండ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, కొటాక్ మహీంద్ర బ్యాంక్, పవర్ గ్రిడ్, మారుతీ, టాటా మోటర్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐఎన్, ఐటీసీ, ఎంఅండ్ఎం, టైటాన్, టీఎసీఎస్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఏసియన్ పెయింట్స్, ఎల్అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్ సీఎల్ టెక్ లాభాల్లో కొనసాగుతోన్నాయి.

హిందుస్థాన్ యూనిలివర్, విప్రో, సన్ ఫార్మా, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు FII, DII పెట్టుబడుల్లో ఎటువంటి స్థిరత్వం కనిపించడం లేదు. స్పైస్‌జెట్ లిమిటెడ్ జనవరి 10, 2024న జరిగిన దాని 39వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రాధాన్యతా ప్రాతిపదికన ఒక్కో షేరుకు రూ. 50 ఇష్యూ ధరలో రూ. 10 చొప్పున 31,83,00,000 ఈక్విటీ షేర్ల ఇష్యూ తీర్మానం చేసింది.


Click it and Unblock the Notifications