నెదర్లాండ్‌కు చెందిన మొబిలిటీ టెక్నాలజీ కంపెనీ స్టెల్లాంటిస్ 2024 నాటికి హైదరాబాద్ టెక్ కేంద్రంలో 2200 మంది నిపుణులను నియమించుకోవాలని భావిస్తోంది. వాహనదారులు తమ కార్లతో మరింతగా కనెక్ట్ కావడానికి కొత్తతరం టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్‌ను అభివృద్ధి చేయడంలో కంపెనీ నిమగ్నమై ఉందని హైదరాబాద్ కేంద్రంలో AI, సాఫ్టువేర్ ఇంజనీరింగ్ పన దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు సైలాంటిస్ సాఫ్టువేర్ బిజినెస్, ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ హెడ్ మమతా చామర్తి తెలిపారు.
హైదరాబాదులో లభ్యమయ్యే నిపుణుల నుండి కంపెనీ ప్రయోజనం పొందనుందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంలో 500 మంది పని చేస్తున్నారని, 2024 నాటికి కొత్తగా 2,200 మంది నిపుణులను ఐటీ, సాఫ్టువేర్ విభాగాల్లో నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. 2030 నాటికి 20 బిలియన్ యూరోల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్యాన్ని చేరడానికి హైదరాబాద్ కేంద్రం దోహదపడుతుందన్నారు.

కంపెనీకి చెన్నై, పుణెలో ఇంజనీరింగ్ కేంద్రాలు ఉన్నాయి. సాఫ్టువేర్ ఆధారిత ప్రోడక్ట్స్‌ను అందించడం వంటి వాటి ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. బీఎండబ్ల్యూ, ఫాక్స్‌కాన్ వంటి కంపెనీలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదుర్చుకుంది. స్మార్ట్ ఫోన్ల ద్వారా పార్కింగ్ సేవలను అందించనుంది. ప్రస్తుతం ఐటీ డివిజన్‌లో 500 మంది ఉద్యోగులు ఉండగా, త్వరలో 1200 మంది చేరనున్నారని మమత తెలిపారు.2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4500 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకుంటామని వెల్లడించారు. ఇందులో అత్యధిక భాగం భారత్‌దే అన్నారు.
2026 నాటికి 4 బిలియన్ యూరోల వ్యాపారానికి, 2030 నాటికి 20 బిలియన్ యూరోలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 380 మిలియన్ యూరోల వార్షిక రెవన్యూ ఉంది. 2025 నాటికి సాఫ్టువేర్, ఎలక్ట్రిషన్ ట్రాన్సాఫార్మేషన్ కోసం 30 బిలియన్ యూరోల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications