గత కొంతకాలంగా భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో చైనా నుండి మన దేశానికి దిగుమతులు తగ్గాయి. అయితే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ నుండి చైనాకు స్టీల్ ఎగుమతులు మాత్రం రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. గతంలో కంటే రెట్టింపు కంటే ఎక్కువ ఎగుమతి జరిగింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో మిగిలిన ఉత్పత్తిని విక్రయించేందుకు ధరను తగ్గించడంతో ఎగుమతులు పెరిగినట్లు చెబుతున్నారు. అమ్మకాలకు సంబంధించి ఏవైనా వాణిజ్య నియమ ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయా పరిశీలిస్తున్నట్లు చైనా ఐరన్ అండ్ స్టీల్ అసోసియేషన్ తెలిపింది.

గతంలో కంటే రెండింతలు..
ప్రముఖ స్టీల్ కంపెనీలు టాటా స్టీల్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ సహా ఇండియన్ స్టీల్ కంపెనీలు ఏప్రిల్-జూలై మధ్య ప్రపంచ మార్కెట్లో మొత్తం 4.64 మిలియన్ టన్నుల ఫినిష్ట్, సెమీ ఫినిష్ట్ స్టీల్ ఉత్పత్తులను విక్రయించాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో 1.93 మిలియన్ టన్నులతో పోలిస్తే రెండింతల కంటే ఎక్కువగా ఉంది. 4.64 మిలియన్ టన్నుల్లో వియత్నాంకు 1.37 మిలియన్ టన్నులు, చైనా కంపెనీలు 1.3 మిలియన్ టన్నులను కొనుగోలు చేశాయి. 2015 ఏప్రిల్ నుండి 2016 మార్చి నుండి డేటాను తీసుకుంటే చైనా కొనుగోలు ఇది ఎక్కువ.

మెజార్టీ స్టీల్ కొనుగోలుదారుగా చైనా
వియత్నాం భారతీయ ఉక్కును క్రమం తప్పకుండా కొనుగోలు చేస్తుంది. అయితే ఇటలీ, బెల్జియంను దాటేసి చైనా రెండో అతిపెద్ద స్టీల్ కొనుగోలుదారుగా అవతరించడం గమనార్హం. గాల్వాన్ ఘటనలో 20 మందికి పైగా భారత సైనికులు అమరులయ్యారు. ఆ తర్వాత చైనా-భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో చాలామంది భారతీయులు చైనా వస్తువులకు దూరంగా ఉంటున్నారు. అలాగే, భారత ప్రభుత్వం కూడా చైనా నుండి పెట్టుబడులను పరిమితం చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంది.

అందుకే చైనా దిగుమతి
ప్రపంచ దేశాల్లో చైనా లీడింగ్ స్టీల్ ఉత్పత్తిదారుగా ఉంది. కానీ మౌలికవసతుల వ్యయాన్ని పెంచుతున్నందున దిగుమతులు అవసరమవుతున్నాయి. చాలా చైనా కంపెనీలు టన్నుకు 500 డాలర్ల అందిస్తుండగా, భారతీయ కంపెనీలు 50 డాలర్ల కంటే తక్కువకు టన్నుకు 430 డాలర్ల నుండి 450 డాలర్లు ఛార్జ్ చేస్తున్నారట.


Click it and Unblock the Notifications