Startups: పలు దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు గత మూడేళ్లుగా ఉద్యోగులకు లేఆఫ్స్ చెబుతున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా సిబ్బంది సంఖ్యలో కోతలు విధిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో కరోనా వల్ల ఇబ్బందులు తలెత్తి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది అయినా సరే అదే పంథాను అనుసరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు అందని ద్రాక్షగా మారాయి. కానీ విచిత్రంగా దిగ్గజ కంపెనీలను ప్రస్తుతం స్టార్టప్స్ రిప్లేస్ చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి సాంకేతికలలో నైపుణ్యం కలిగిన కొత్త వారిని రిక్రూట్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఫౌండిట్ సర్వే ప్రకారం గత ఏడాది కాలంలో స్టార్టప్‌ల సంఖ్య 37 శాతం పెరిగింది. దీంతో ఉద్యోగాల కల్పన కూడా 14 శాతం వృద్ధి చెందినట్లు తెలుస్తోంది.

దాదాపు అన్ని స్టార్టప్లు సగానికి పైగా ఫ్రెషర్స్ ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. IT రంగంలోనూ ఫ్రెషర్స్ నియామకాల్లో 23 శాతం మేర వృద్ధి కనిపించింది. ఇక ఎడ్ టెక్, ఫిన్ టెక్ మరియు మీడియా రంగాల్లో నియామకాలు పెరుగుతూ పోతున్నాయి. వీటితోపాటు ఆర్థిక సేవలు, భీమ రంగాల్లోనూ కొన్ని కంపెనీలకు పెద్దపీట వేస్తున్నాయి. ప్రముఖ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ దాదాపు 5 వందల మందిని ఇదేవిధంగా క్యాంపస్ నుంచి రిక్రూట్ చేసుకుంది.
ఈ స్థాయిలో ఫ్రెషర్స్ కు స్టార్టప్స్ అవకాశాలు కల్పించడానికి కారణాలు లేకపోలేదు. అంకుర సంస్థలన్నీ పెద్ద మొత్తంలో వెచ్చించి ఉద్యోగులను నియమించుకునే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం మంచి బూమ్‌లో ఉన్న టెక్నాలజీలకు సంబంధించిన నిపుణుల కోసం భారీగా ప్యాకేజీలు ఆఫర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఫ్రెషర్స్‌కి అంత ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పైగా కొత్త ఆలోచనలకు ఓ ప్లాట్‌ఫారమ్ కల్పించినట్లు అవుతుంది అని భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications