అనిల్ అంబానీని NCLTకి లాగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు లాగింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom), రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్ (RITL)లకు చెందిన రూ.1,200 కోట్ల రుణాలపై అనిల్ అంబాని వ్యక్తిగత హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఎస్బీఐ ఆయనను ముంబై బెంచ్‌కు చెందిన ఎన్సీఎల్టీకి లాగింది.
అనిల్ అంబానీకి సంబంధించి మరిన్ని వార్తలు

ఇది అనిల్ అంబానీకి సంబంధించింది కాదు
ఐబీసీ సెక్షన్ 95(1) కింద కేసు నెంబర్ సీపీ (ఐబీ) నెంబర్ 916, 917 దాఖలు చేయబడిందని, వ్యక్తిగత హామీదారు దివాలా తీర్మానం ప్రక్రియ కోసం అనిల్ అంబానీపై ఎన్సీఎల్టీకి వెళ్లింది. ఈ అంశంపై అనిల్ అంబానీ ప్రతినిధి మాట్లాడుతూ... ఇది రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ రుణాలకు సంబంధించిన విషయమని, ఇది అనిల్ అంబానీ సొంత రుణం కాదని తెలిపారు. అనిల్ అంబానీ దీనికి సమాధానం చెబుతారన్నారు.

రికవరీ కోసం చైనీస్ బ్యాంకులు కూడా
అనిల్ అంబానీని అప్పులు వెంటాడుతోన్న విషయం తెలిసిందే. గత నెలలో చైనా బ్యాంకులకు రుణాన్ని చెల్లించాలని యూకే కోర్టు ఆదేశించింది. చైనాకు చెందిన మూడు బ్యాంకుల నుంచి 717 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5,446 కోట్లు) రుణానికి సంబంధించి అనిల్ అంబానీ పూచీగా ఉన్నారు. 2012 ఫిబ్రవరిలో ఆర్.కామ్ ఈ రుణాన్ని తీసుకున్నది. కానీ ప్రస్తుతం కంపెనీ నష్టాల్లో నడుస్తుండటంతో.. తాము ఇచ్చిన రుణం తిరిగి చెల్లించాలని బ్యాంకులు కోర్టును ఆశ్రయించారు. కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల పిటిషన్‌ను లండన్ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. పిటిషనర్ రుణాలపై వాదనలు విన్న ధర్మాసనం.. అనిల్ అంబానీని రుణ మొత్తం చెల్లించాలని జస్టిస్ నిగెల్ ఆదేశించారు. ఇందుకు 21 రోజుల గడువును ఇచ్చింది.

అనిల్ అంబానీ చెల్లించాల్సిందే..
3.2 క్లాజ్ ప్రకారం తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో, గ్యారంటీ ఉన్న అనిల్ అంబానీ రుణం చెల్లించాల్సి ఉంటుందని లండన్ కోర్టు తెలిపింది. రుణం చెల్లించేందుకు అనిల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే చైనీస్ బ్యాంకు ఐసీబీసీకి మొత్తం వ్యక్తిగత రుణ హామీని అనిల్ అంబానీ ఖండించారు. ఈ గ్యారెంటీ పరిధి రూ.1200 కోట్ల నుండి రూ.1300 కోట్లు అని తెలిపింది.


Click it and Unblock the Notifications