శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది. నిత్యావసర వస్తువుల దిగుమతులకు విదేశీ మారకనిల్వలు అడుగంటిపోయాయి. ఇంధన సరఫరాకు కూడా బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో కొనుగోలుకు కూడా ఇబ్బంది అవుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందుల కారణంగా రాజధాని కొలంబోలోని అధ్యక్షుడు రాజపక్స నివాసాన్ని గురువారం వేలాదిమంది ముట్టడించారు. అధ్యక్ష బాధ్యతల నుండి గొటబయా తప్పుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ ఘటన హింసాత్మకంగా మారింది. కర్ఫ్యూ విధించారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో లంక తమిళుల కోసం ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోరారు.
చమురు కొరత కారణంగా విద్యుత్ సమస్య కూడా తలెత్తుతోంది. బుధవారం నుండి రోజుకు పది గంటల పవర్ కట్స్ ఉంటున్నాయి. అంతకుముందు నెల రోజులుగా రోజుకు ఏడు గంటల పాటు విద్యుత్ కొరత కనిపించింది.

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్న శ్రీలంకకు అత్యవసరంగా 40వేల టన్నుల డీజిల్‌ను పంపించాలని ఇటీవల భారత్ నిర్ణయించింది. భారత్ ఇప్పటి వరకు రూ.2.5 బిలియన్ డాలర్ల రుణాలు అందించింది. భారత్‌కు చెందిన ఎగ్జిమ్ బ్యాంకు 500 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.4వేల కోట్లు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications