కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు పెరగనుంది. స్పెయిన్‌లో ఇది 19 శాతానికి పెరగనుందని అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది. తమ ఎకానమీ 9.2 శాతం మేర క్షీణిస్తుందని లెక్కలు వేసుకుంటోంది. డిప్యూటీ ప్రధానమంత్రి నడియా కాల్వినో శుక్రవారం స్పెయిన్ ఆర్థిక స్థిరత్వ ప్రణాళికను వివరించారు. ఈ సందర్భంగా ఎకానమీ బారీగా క్షీణిస్తుందని, నిరుద్యోగం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
స్పెయిన్ ఆర్థిక వ్యవస్థ 2013 నుండి వరుసగా 25 క్వార్టర్‌లు పాజిటివ్‌తో ముందుకు సాగింది. 2020 ఫస్ట్ క్వార్టర్‌లో 5.2 శాతం క్షీణించింది. 2021 నాటికి స్పెయిన్ ఆర్థిక వ్యవస్థ కోలుకొని 6.8 శాతానికి చేరుకుంటుందని నడియా కాల్వినో చెప్పారు. ఇప్పటికే స్పెయిన్‌లో వేలు, లక్షల మంది ఉద్యోగులు వేతనం లేని సెలవుల్లో ఉన్నారు. మార్చి 14వ తేదీన ఎమర్జెన్సీ ప్రకటించారు.

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 234,725 మంది మృత్యువాత పడగా, 3,329,450 కేసులు నమోదయ్యాయి. స్పెయిన్‌లో 239,639 కేసులు నమోదు కాగా 24,543 మరణించారు. కేసుల్లో అమెరికా తర్వాత స్పెయిన్ రెండో స్థానంలో ఉంది. మరణాల్లో అమెరికా (63,876), ఇటలీ (27,967), యూకే (26,771) తర్వాత నాలుగో స్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications