పర్సనల్ ఫైనాన్స్‌ను అర్థం చేసుకోవడం, నిర్వహించడం అంత సులభమైన పని కాదు. కరోనా నేపథ్యంలో చాలామంది పర్సనల్ ఫైనాన్స్ పైన దృష్టి సారిస్తున్నారు. ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందోననే భావనతో రాబడిపై ప్రణాళికతో ముందుకు సాగే వారి సంఖ్య పెరిగింది. అధిక రాబడి కోసం ఆశపడి చేతులు కాల్చుకున్నవారు కూడా ఉన్నారు.
గత ఏడాది కరోనా నేపథ్యంలో సూచీలు భారీగా పతనం కావడంతో చాలామంది పెట్టుబడులకు మొగ్గు చూపారు. అలాంటి సమయంలో ఇన్వెస్ట్ చేసి వారికి ఇప్పుడు మంచి రిటర్న్స్ వచ్చాయి. అయితే ఈక్విటీ మార్కెట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించి ఇన్వెస్ట్ చేయాలి.

రూల్ 72
ఈ రూల్ 72 ద్వారా మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం ఎన్ని సంవత్సరాల్లో రెండింతలు అవుతుందో తెలుసుకోవచ్చు. అయితే ఇది స్థిర వడ్డీ రేటుకు వర్తిస్తుంది. ఉదాహరణకు మీ రు FDలో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. 5 శాతం వడ్డీ రేటు ఉంది అనుకుంటే మీ FD మొత్తం రెండింతలు కావడానికి 72/5 =14.4 సంవత్సరాలు పడుతుంది. ఈ రూల్‌ను వివిధ సందర్భాల్లో ఉపయోగించవచ్చు. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్, బంగారం, ఇతర డెట్ కోసం ఉపయోగించవచ్చు.

రూల్ 114
రూల్ 114 కూడా మీ పెట్టుబడి మొత్తంపై రిటర్న్స్ రావడానికి ఎంత సమయం పడుతుందని చెబుతుంది. ఇక్కడ 114ను మీ రిటర్న్స్ వడ్డీ రేటుతో భాగించాలి. ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్స్ పైన 12 శాతం రిటర్న్స్ ఉన్నాయని అనుకుందాం. అప్పుడు 114/12 = 9.5 సంవత్సరాలు. అయితే ఇక్కడ మూడు రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుందో చెబుతుంది. అంటే 9.5 సంవత్సరాల్లో మీ పెట్టుబడి మొత్తం మూడు రెట్లు అవుతుంది.

రూల్ 144
మీ పెట్టుబడి మొత్తం నాలుగు రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుందని రూల్ 144 ద్వారా తెలుసుకోవచ్చు. మీ FD వడ్డీ రేటు 5 శాతం అయితే 144/5 = 28.8 సంవత్సరాలు పడుతుంది. అలాగే రూల్ 70 వంటి ద్వారా పెట్టుబడి-రిటర్న్స్‌కు ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications