చైనాలో పుట్టిన కరోనా వైరస్ భారత్ సహా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో సోమవారం ప్రపంచ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. భారత మార్కెట్లలో సెన్సెక్స్ 458 పాయింట్ల నష్టంతో ముగిసింది. క్రూడాయిల్ ధరలపై కూడా కరోనా వైరస్ ప్రభావం ఉంది. ఈ ధరలు 2.51 శాతం మేర పడిపోయి బ్యారెల్‌కు 59.04 డాలర్లుగా ఉంది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్రాలు అంగీకరించడం లేదు. తాజా బడ్జెట్‌లో పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని సవరిస్తారా అనే చర్చ సాగుతోంది.

తగ్గుతున్న పెట్రోల్ ధరలు
అమెరికా డాలర్‌తో రూపాయి మారకం సోమవారం 10 పైసలు పెరిగి 71.44 వద్ద ఉంది. రూపాయి బలహీనపడటంతో పాటు వివిధ కారణాల వల్ల బంగారం ధర పెరిగింది. నిన్న 10గ్రాముల పసిడి రూ.133 పెరిగి రూ.41,292 వద్దకు చేరుకుంది. వెండి ధర కిలోకు రూ.238 పెరిగి రూ.47,277గా ఉంది. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఇలాంటి సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు తగ్గడం స్వాగతించదగ్గ పరిణామమని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయట.

గత ఏడాది ఇదే సమయంలో..
గత ఏడాది జూలైలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలోను పెట్రో ధరలు గరిష్టస్థాయి నుంచి తగ్గిపోయాయి. ఆ సమయంలో పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ డ్యుటీనీ రూ.1 పెంచుతూ నిర్ణయం తీసుకునే వెసులుబాటును ఇచ్చాయని అంటున్నారు. ధరలు తగ్గిన సమయంలో రూ.1 ఎక్సైజ్ డ్యుటీ ప్రభావం ఎక్కువగా ఉండదని అంటున్నారు.

పెట్రోల్‌పై ప్రస్తుత ఎక్సైజ్ డ్యుటీ, వ్యాట్
ప్రస్తుతం లీటర్ పెట్రోల్ పైన కేంద్రం ఎక్సైజ్ డ్యుటీ రూ.17.98, రాష్ట్రాల వ్యాట్ రూ.14.98గా ఉంది. మొత్తం రూ.32.96 మొత్తాన్ని డీలర్ల నుంచి ప్రభుత్వాలు తీసుకుంటాయి.

డీజిల్‌పై ప్రస్తుత ఎక్సైజ్ డ్యుటీ, వ్యాట్
డీజిల్ విషయానికి వస్తే లీటర్ పైన కేంద్ర ఎక్సైజ్ డ్యుటీ రూ.13.83, రాష్ట్రాల వ్యాట్ రూ.9.47గా ఉంది. మొత్తం రూ.23.3ను డీలర్స్ నుంచి వసూలు చేస్తారు.

క్రూడాయిల్ పైన కరోనా వైరస్ దెబ్బ
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు మార్కెట్లపై మరింత ప్రభావం చూపిస్తే చమురు ధరలపై మరింత ఒత్తిడి ఏర్పడుతుందనేది నిపుణుల మాట. క్రూడాయిల్‌ను ఎక్కువగా వినియోగించే దేశాల్లో చైనా రెండో స్థానంలో ఉంది. చైనాలో చమురు దిగుమతులకు డిమాండ్ తగ్గితే ఇది ప్రపంచ మందగమనాన్ని వేగవంతం చేస్తుందని, చైనాతో భారత వాణిజ్యం పైన ప్రభావం చూపుతుందంటున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications