కరోనా వైరస్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. కంపెనీలు, దుకాణాలు మూతబడటంతో ఉత్పత్తి పడిపోవడంతో పాటు డిమాండ్ కూడా తగ్గింది. మన దేశంలో ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్ 41 శాతం పడిపోయింది. సీఎంఆర్ ఇండియా మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్ రివ్యూ రిపోర్ట్ ప్రకారం 2020లో ఈ క్వార్టర్‌లో గత ఏడాదితో పోలిస్తే ఈ మేరకు తగ్గిపోయింది. అయితే ఈ క్యాలెండర్ ఇయర్‌లో రానున్న రెండు వారాల్లో పుంజుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

హైపర్ లోకల్ డెలివరీ దోహదం
కరోనా దెబ్బతో మార్చి నుండి ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొందని, సరఫరా, డిమాండ్ రెండూ దెబ్బతిన్నాయని, కొత్తగా హైపర్‌లోకల్ డెలివరీ మోడల్ కొంతదోహదపడిందని, ఆయా కంపెనీల బ్రాండ్స్ ఉన్నచోట కస్టమర్లకు డెలివరీ చేస్తున్నాయని సీఎంఆర్ ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (IIG) హెడ్ ప్రభు రామ్ అన్నారు. అయితే ఇది కూడా పరిమితమేనని చెప్పారు.

పెరిగిన శాంసంగ్ వాటా
ఈ బ్రాండ్ మొత్తం షిప్‌మెంట్స్‌లో రెడ్‌మీ 8ఏ డ్యూయల్, రెడ్‌మీ 8, రెడ్‌మీ నోట్ 8 వాటానే 60 శాతం ఉంటుంది. దీంతో షిప్‌మెంట్‌లో షియోమీ 30 శాతంతో మార్కెట్ లీడర్‌గా నిలిచింది. శాంసంగ్ మార్కెట్ షేర్ 24 శాతంగా ఉంది. క్వార్టర్ పరంగా 8 శాతం వృద్ధిని నమోదు చేసుంది. ఇందులో శాంసంగ్ గెలాక్సీ ఎం11, ఓ21 ఎస్, ఏ31 వాటా 50 శాతం ఉంది. ఈ క్వార్టర్‌లో వివో మార్కెట్ షేర్ 17 శాతంతో ఫ్లాట్‌గా నిలిచింది. ఈ బ్రాండ్‌లో వై17, వై 91ఐ, వై50 వాటా 55 శాతంగా ఉంది.

మొదటిసారి 2 శాతం తగ్గిన రియల్‌మి వాటా
భారత మార్కెట్‌లోకి ప్రవేశించిన తర్వాత రియల్‌మి క్వార్టర్ పరంగా మొదటిసారి 2 శాతం క్షీణతను నమోదు చేసింది. కరోనా, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనీస్ ఉత్పత్తులపై ప్రభావం పడింది. ఒప్పో మార్కెట్ షేర్ కూడా క్వార్టర్ పరంగా 3 శాతం తగ్గింది. మార్కెట్ వాటాలో ఐదో స్థానంలో ఉంటుంది. ఐఫోన్ ఎస్ఈకి మంచి డిమాండ్ రావడంతో టాప్ స్మార్ట్ ఫోన్ లీడర్ బోర్డులో ఆఫిల్ 8వ స్థానంలో నిలిచింది. ఇప్పటికీ టాప్ 5 కంపెనీల్లో చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీలే నాలుగు ఉన్నాయి. అయితే వాటా మాత్రం అంతకుముందు క్వార్టర్ 81 శాతం కాగా, ఈ క్వార్టర్‌లో 73 శాతానికి పడిపోయింది. కాగా, ఏప్రిల్ - జూన్ క్వార్టర్‌లో 41 శాతం తగ్గిన స్మార్ట్ ఫోన్ సేల్స్ వచ్చే క్వార్టర్‌లలో పండుగల సీజన్ నేపథ్యంలో పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications