బంగారం మళ్లీ పెరుగుదల బాట పట్టిందా?: రేట్లిలా
హైదరాబాద్: దేశంలో బంగారం, వెండి రేట్లు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. వాటి ధరలు స్వల్పంగా పెరిగాయి. సాధారణంగా వీకెండ్‌లోనూ వాటి ధరల్లో కొద్దో, గొప్పో కదలికలు కనిపిస్తుంటాయి. ఈ వారాంతం కూడా అదే సంప్రదాయం కొనసాగింది. మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో బంగారం ధరలు పెరిగాయి. శుక్రవారం నాటి బంగారం ధరల ట్రేడింగ్‌తో పోల్చుకుంటే ఇవ్వాళ కొద్దిగా పైకి ఎగబాకాయి. మళ్లీ పైపైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలను ఇచ్చినట్టయింది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,770 రూపాయలుగా నమోదైంది. గ్రాముకు 10 రూపాయలు మాత్రమే పెరిగింది. ఇది నామమాత్రమే. వెండి ధరలో స్థిరత్వం కొనసాగింది. ఇవ్వాళ ఈ వైట్ మెటల్ రేట్ స్థిరంగా ఉంది. వెండి కిలో ఒక్కింటికి 69 వేల రూపాయలు పలుకుతోంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,450 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 51,770 రూపాయల వద్ద నిలిచింది. ముంబై, కోల్‌కత బులియన్ మార్కెట్లల్లోనూ ఇదే ధర రికార్డయింది.

చెన్నై బులియన్ మార్కెట్‌లోలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 48,220 రూపాయలు, 24 క్యారెట్లు 52,600 రూపాయలు. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు 51,770 రూపాయలుగా ఉంటోంది. 22 క్యారెట్ల బంగారం 47,450 రూపాయలు. ఇదే ధర బెంగళూరు, మైసూరు బులియన్ మార్కెట్లల్లోనూ కనిపించింది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు 47,520, పుణేలో 47,480 రూపాయలు. ఈ రెండు నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 51,830, 51,790 రూపాయలుగా నమోదైంది.
కోయంబత్తూర్‌లో 22 క్యారెట్ల బంగారం 48,220 రూపాయలు, 24 క్యారెట్లు 52,600 రూపాయలకు చేరింది. మధురైలో 22 క్యారెట్ల బంగారం 48,220 రూపాయలు, 24 క్యారెట్లు 52,600 రూపాయలకు చేరింది. పాట్నాలో 24 క్యారెట్ల బంగారం 51,790, 22 క్యారెట్లు 47,480 రూపాయలుగా నమోదైంది. వెండి ఫ్యూచర్ ట్రేడింగ్‌లో మాత్రం స్థిరత్వం కొనసాగుతోంది. శుక్రవారం నాటి రేటే ఇవ్వాళ కూడా నమోదైంది. వెండి కిలో ఒక్కింటికి 69,000 రూపాయలు పలుకుతోంది.


Click it and Unblock the Notifications