సింగపూర్ ఎకానమీకి 2025 సంవత్సరం నాటికి 1.2 మిలియన్ల డిజిటల్ స్కిల్డ్ వర్కర్స్ అవసరం. ఓ సర్వే ప్రకారం ప్రస్తుతం 22 లక్షల మంది ఉండగా, ఇది 55 శాతం అధికం. ఈ మేరకు గురువారం ఈ నివేదిక వెల్లడైంది. ఆస్ట్రేలియా, ఇండియా, ఇండోనేషియా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా దేశాల్లో అమెజాన్ వెబ్ సిరీస్ ఈ సర్వే నిర్వహించింది. డిజిటల్ నైపుణ్యపరంగా ఎదురయ్యే సవాళ్లను ఉద్యోగులు భవిష్యత్తులో ఎలా ఎదుర్కోనున్నారనే కోణంలో చేపట్టిన ఈ సర్వే వివరాలను వెల్లడించింది.

డిజిటల్ స్కిల్స్
పై ఆరు దేశాలతో కలిపి మొత్తం ఆరు దేశాల్లోని 3వేల మంది నుండి వివరాలు సేకరించారు. ఇప్పటికే సింగపూర్‌లోని ప్రతి పదిమంది ఉద్యోగుల్లో ఆరుగురు తమ విధుల్లో డిజిటల్ నైపుణ్యాలను వినియోగిస్తున్నారు. ఈ విషయంలో సింగపూర్ రెండోస్థానంలో ఉంది. 64 శాతంతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాలో ప్రతి ఐదుగురిలో ఒకరు (22 శాతం మంది వరకు) వినియోగిస్తున్నారు. ఆరు దేశాల్లో ఇది అత్యధికం. ఆ తర్వాత స్థానంలో 21 శాతంతో దక్షిణ కొరియా ఉంది.

12 శాతం మందికి డిజిటల్ స్కిల్స్
భారత్‌లోని ఉద్యోగుల్లో 12 శాతం మందికే డిజిటల్ స్కిల్స్ ఉన్నప్పటికీ, అడ్వాన్స్డ్ డిజిటల్ స్కిల్స్ కోసం అత్యధికంగా 71 శాతం మంది దరఖాస్తు చేసుకున్నారు. సింగపూర్ 59 శాతంతో మూడో స్థానంలో ఉంది. సింగపూర్‌కు భవిష్యత్తులో అవసరమయ్యే 12 లక్షలమందిలో ఇప్పటి వరకు ఎలాంటి డిజిటల్ నైపుణ్యాలను వినియోగించనివారు, నిరుద్యోగులు, 2025 నాటికి ఉద్యోగం అవసరమయ్యేవారు, ప్రస్తుతం విద్యార్థులుగా ఉండి ఉద్యోగాల్లో చేరేవారు డిజిటల్ నైపుణ్యాలను నేర్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

వీటికి డిమాండ్ ఎక్కువ
ఇప్పుడున్న వారితో కలిపి మొత్తం 2025 నాటికి సింగపూర్‌లోని ఉద్యోగులకు 2.38 కోట్ల డిజిటల్ స్కిల్ ట్రైనింగ్ సెషన్స్ నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇక, భారత్ విషయానికి వస్తే రానున్న అయిదేళ్లలో 39 కోట్ల ట్రైనింగ్ సెషన్స్ అవసరమని వెల్లడించింది. 2020-2025 మధ్య భారత్‌తో పాటు, జపాన్, సింగపూర్ దేశాల్లోని డిజిటల్ స్కిల్డ్ సిబ్బందికి అడ్వాన్స్డ్ క్లౌడ్ స్కిల్స్‌కు డిమాండ్ ఎక్కువ అని తెలిపింది.


Click it and Unblock the Notifications