రష్యా-ఉక్రెయిన్ యుధ్దం కొనసాగుతున్న వేళ పశ్చిమ దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించిన సంగతి విదితమే. ఈ ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు దిగుమతులు చేసుకుంటోంది. దీనిపై పాశ్చాత్య దేశాలు భారత్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రష్యా చమురు (Russia Oil) దిగుమతి చేసుకోవడంపై భారత్ మీద పశ్చిమదేశాలు తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టిన నేపథ్యంలో.. UKలో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి గట్టిగా స్పందించారు.
ఏ దేశం కూడా తమ ఆర్థిక వ్యవస్థను ఆపేయాలని కోరుకోదంటూ పశ్చిమ దేశాల వ్యాఖ్యలకు బదులిచ్చారు. బ్రిటిష్ రేడియో స్టేషన్ టైమ్స్ రేడియోతో భారత యుకె హైకమిషనర్ దొరైస్వామి మాట్లాడుతూ.. ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అని తెలిపారు. ఇదే సమయంలో దేశ అవసరాల్లో 80 శాతం దిగుమతులపైనే అధారపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే రష్యా నుంచి తక్కువ ధరకు చమురు దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. అవసరాల మేరకు డిస్కౌంట్‌పై Russian Oil ను ఎలా కొనుగోలు చేయకుండా ఉంటామని ప్రశ్నించారు. మేం ఏం చేయాలని పశ్చిమ దేశాలు కోరుకుంటున్నాయి.

మా ఆర్థిక వ్యవస్థను స్విచ్చాఫ్ చేసుకోవాలా..?' పశ్చిమ దేశాలను ప్రశ్నించారు దొరైస్వామి. ఆయన మాట్లాడుతూ..ఆంక్షలు విధించే పశ్చిమాసియా దేశాలు కూడా రష్యా నుండి లేదా ఇతర శత్రువు దేశాల నుండి అరుదైన భూములు, ఇంధన వనరులను కొనుగోలు చేస్తూనే ఉన్నాయని తెలిపారు.మేము కొనుగోలు చేయవద్దని చెబుతున్న దేశాల నుంచే చాలా మంది ఇంకా కొనుగోలు చేస్తూనే ఉన్నారు. ఇది వారికి కనిపించడం లేదా అంటూ వ్యంగ్యం విసిరారు.
భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉంది. సాధారణంగా మిడిల్ ఈస్ట్ నుంచే భారత్ ఎక్కువ చమురు దిగుమతి చేసుకుంటోంది.అయితే 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దాడి అనంతరం రష్యా చమురుపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో.. తగ్గింపు ధరలతో రష్యా నుండి భారీగా చమురు కొనుగోలు చేయడం ప్రారంభించింది భారత్. 80 శాతం కంటే ఎక్కువ ఇంధనాన్ని అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటోంది.
భారత్-రష్యా సంబంధాలు కేవలం చమూరుతో పరిమితం కాకుండా భద్రతాపరమైన కోణాల్లోనూ ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.కొన్ని పాశ్చాత్య దేశాలు మనకు ఆయుధాలు అమ్మకుండానే, మన పక్క దేశాలకు అమ్ముతున్నారు. అదే ఆయుధాలు భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించబడుతున్నాయి. అలాంటి సమయంలో మేము మా భద్రతను గౌరవించుకోవాలని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని కూడా ఆయన స్పష్టం చేశారు. భారతదేశం శాంతికి నిలయమైన దేశమని.. ఈ రెండు దేశాల ఘర్షణ త్వరగా ముగియాలని భారత్ కోరుకుంటోందని తెలిపారు. ప్రపంచంలోని అన్ని ఘర్షణలు ముగియాలని మేము కోరుకుంటున్నట్లే..మీరు చేసే విమర్శ కూడా ఈ సమాధానంతో ముగియాలని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు.
సాధారణంగా పశ్చిమాసియాలో..ముఖ్యంగా అరేబియా ద్వీపకల్పంలో ఉన్న దేశాలు. ఇందులో ఈజిప్ట్, ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియాతో పాటు ఇతర అరేబియా దేశాలు ఉంటాయి. కొన్నిసార్లు ఈ ప్రాంతంలో ఉత్తర ఆఫ్రికా మరియు ఇతర ప్రాంతాలు కూడా చేర్చబడతాయి.
మధ్యప్రాచ్య దేశాల జాబితా: అల్జీరియా, బహ్రెయిన్, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, లెబనాన్, లిబియా, ఒమన్, పాలస్తీనా, కతార్, సౌదీ అరేబియా, సిరియా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE). ఈ జాబితాలో ఉన్న దేశాలన్నీ ఒకేలా ఉండవు, కానీ సాధారణంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో భాగంగా పరిగణించబడతాయి
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications