బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 70 వేలకు పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
మొన్న 60 వేలు దాటిన బంగారం ధరలు, నిన్న కాస్త క్షీణించాయి. మళ్లీ నేడు బంగారం ధరలు పెరగడంతో ఈరోజు కూడా బంగారం ధర 60 వేల మార్కును దాటింది. అమెరికాలో నెలకొన్న బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా బంగారం ధరల పరుగులు కొనసాగుతున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే 70 వేల వరకు బంగారం పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో బంగారం ప్రియులు కొనుగోలు చెయ్యాలా ? వద్దా? అన్న సందిగ్ధంలో ఉన్నారు.

నిన్నటి కంటే ఈ రోజు బంగారం ధరలు ఎంత పెరిగాయంటే
ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశీయంగాను బంగారం ధరలు కొనుగోలు చేయలేనంతగా పెరిగిపోతున్నాయి. దేశీయంగా పెరిగిన బంగారం ధరలను చూస్తే భారత దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ నిన్నే 54,800 ఉండగా, నేడు 55 వేలకు చేరుకుంది. నిన్నటి కంటే ఈరోజు 200 రూపాయల మేర ఆర్నమెంట్ గోల్డ్ మీద ధర పెరిగింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే నిన్న 59,780 ఉన్న బంగారం ధర, నేడు 60 వేలకు చేరుకుంది. బంగారం మీద నేడు 220 మేర ధర పెరిగింది.

హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలు
హైదరాబాద్లో బంగారం ధర విషయానికొస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 60,000గా ప్రస్తుతం కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రస్తుతం 55,150 రూపాయలుగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 60 వేల 150 రూపాయలుగా కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55 వేల రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 60 వేల రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.

ఏపీలోని ప్రధాన నగరాలు,బెంగళూరులో బంగారం ధరలు
ఇక విజయవాడ విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55 వేల రూపాయలుగా కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,050 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,050 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.

తమిళనాడులో ప్రధాన నగరాల్లో బంగారం ధరలిలా
ఇక దేశంలోనే అత్యధిక ధరలు ఉండే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,700గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,770 గా కొనసాగుతుంది. చెన్నైలో మాత్రమే కాకుండా కోయంబత్తూరు, మధురై, సేలం, తిరుచ్చి, వేల్లూరు, తిరుపూర్, తిరునవ్వేలి, ఈ రోడ్ లలో కూడా 22 క్యారెట్ల బంగారం ధర 55,700 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,770 రూపాయలుగా కొనసాగుతుంది.


Click it and Unblock the Notifications