ఈరోజు బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. బంగారం ప్రియులకు గట్టి షాక్ ఇచ్చాయి. ఒక్క రోజే బంగారం ధరలు ఎనిమిది వందల రూపాయలకు పైగా పెరగడం నిజంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు షాక్ అనే చెప్పాలి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒడిదుడుకులకు లోనవుతున్న బంగారం ధరలు తగ్గుతాయని అందరూ భావిస్తూ ఉంటే, అవి విపరీతంగా పెరగడం ప్రధానంగా కనిపిస్తుంది.
భారతదేశంలో బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఎనిమిది వందల రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఎనిమిది వందల ఎనభై రూపాయల మేర పెరిగింది. దేశీయంగా బంగారం ధరలు చూస్తే హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,500 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,640 రూపాయలుగా ట్రేడవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,650 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,790 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,500 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,640 రూపాయలు గా ట్రేడవుతోంది.
బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,550 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,690 రూపాయలుగా ట్రేడవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి, అనంతపురం, కాకినాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,500 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,640 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.

దేశంలోనే బంగారం ధరలు ఎక్కువగా ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, మధురై, కోయంబత్తూరు, సేలం, ఈ రోడ్, తిరుచ్చి, తిరుపూరు, తిరునవ్వేలి లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 57, 060 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,240 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.


Click it and Unblock the Notifications