గత నాలుగు రోజులుగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నాలుగు రోజులుగా వరుసగా బంగారం ధరలు తగ్గడంతో, నేడు కూడా బంగారం ధరలు తగ్గుతాయని చాలామంది భావించారు. అయితే నేడు బంగారం ధరలు పెరిగి బంగారం కొనుగోలుదారులకు కాస్త నిరాశను కలిగించాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతోపాటు దేశీయంగాను పెరుగుతున్నాయి. ఇక నేడు బంగారం ధరల విషయానికొస్తే దేశంలో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,700గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,670 ప్రస్తుతం కొనసాగుతుంది. నిన్న ఉన్న ధర మీద నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం మీద 200 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మీద 220 రూపాయలు ధర పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 59,670 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 54,700 రూపాయలుగా కొనసాగుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,850 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,820 రూపాయలుగా కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,700 రూపాయలుగా కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,670 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,750 రూపాయలుగా కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బెంగళూరులో 59,720 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, తిరుపతి, అనంతపురం, రాజమండ్రి, కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,700 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,670 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక దేశంలోనే అత్యధిక ధరలు ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూర్, మధురై తో పాటు ప్రధాన నగరాలలో ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు 60 వేల 490 రూపాయలుగా విక్రయించబడుతుంది. ఇక 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో 55,450 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Click it and Unblock the Notifications