నిన్నటి ధరలకు కొనసాగింపుగా నేడు కూడా బంగారం ధరలు పెరిగాయి. గత రెండు వారాలలో చూసినట్లయితే బంగారం ధరలు భారీగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. గత రెండు వారాలుగా సుమారు నాలుగువేలకు పైగానే బంగారం ధరలు పెరిగిన పరిస్థితి బంగారం ప్రియులకు షాక్ అనే చెప్పాలి. విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలకు ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ప్రతికూల పరిస్థితులు, యూఎస్ లో చోటు చేసుకున్న బ్యాంకింగ్ సంక్షోభం, రూపాయి మారకం విలువ వంటి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇక ఈరోజు బంగారం ధరల విషయానికి వస్తే దేశీయంగా బంగారం ధరలు నేడు కొద్దిపాటి పెరుగుదలను నమోదు చేశాయి. నిన్నటి ధర మీద ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 200 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 220 రూపాయల మేర ధర పెరిగింది. ఇదిలా ఉంటే ఈరోజు ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరల వివరాలు చూస్తే.. హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55 వేల రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ లో 60 వేల రూపాయల వద్ద విక్రయించబడుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,150 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,150 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 60 వేల రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,050 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బెంగళూరులో 60,050 రూపాయలుగా కొనసాగుతుంది.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపూర్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,000 ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల రూపాయలుగా కొనసాగుతుంది. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై తో పాటు కోయంబత్తూరు, మధురై, సేలం, తిరుచ్చి, వెల్లూరు ,తిరుపూర్, తిరునవ్వేలి , ఈరోడ్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,600 ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బెంగళూరులో 60,650 రూపాయలుగా కొనసాగుతుంది.


Click it and Unblock the Notifications