ఢిల్లీ: దసరా, దీపావళి పర్వదినం సందర్భంగా అక్టోబర్ నెలలో మెరుగుపడిన పాసింజర్ వెహికిల్ విక్రయాలు, నవంబర్ నెలలో తగ్గాయి. ప్యాసింజర్ వెహికిల్ ఉత్పత్తి గత నెలలో 4.06 శాతం పెరిగింది. అదే సమయంలో ఓవరాల్ డొమెస్టిక్ ఆటో సేల్స్ 12 శాతం తగ్గాయి. ఈ మేరకు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM) నివేదిక వెల్లడిస్తోంది.

ప్యాసింజర్ వెహికిల్స్ ఊరట
నవంబర్ నెలలో ప్యాసింజర్ వెహికిల్స్ ఉత్పత్తి 4.06 శాతం పెరిగి 2,90,727 యూనిట్లుగా ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్దీపన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆటో ఇండస్ట్రీకి ఇది కొంత పాజిటివ్. మరో విషయం ఏమంటే గత ఏడాది నవంబర్ నెలలో ఈ సేల్స్ 2,66,000 ఉండగా ఈ ఏడాది ఇదే సమయంలో 2,63,773గా ఉన్నాయి. అంటే ఇంత మందగమనంలో కూడా కేవలం 0.84 శాతం మాత్రమే తగ్గుదల ఆటో ఇండస్ట్రీకి ఊరట కలిగించే అంశం.

భారీగా తగ్గిన డొమెస్టిక్ కారు సేల్స్
అయితే డొమెస్టిక్ కారు సేల్స్ మాత్రం 10.83 శాతం మేర తగ్గాయి. 2018 నవంబర్ నెలలో 1,79,783 సేల్స్ ఉండగా, 2019 నవంబర్ నెలలో 2,66,000 యూనిట్లు అమ్ముడుపోయాయి.

మోటార్ సైకిల్ విక్రయాలు
మోటార్ సైకిల్ విక్రయాలు 14.87 శాతం మేర తగ్గాయి. గత ఏడాది నవంబర్ నెలలో 10,49,651 యూనిట్లు విక్రయించగా, అదే సమయంలో ఈ ఏడాది 8,93,538 యూనిట్లు సేల్ అయ్యాయి. కమర్షియల్ వెహికిల్ సేల్స్ 14.98 శాతం తగ్గాయి. ఇవి 91,907 సేల్ అయ్యాయి.

మొత్తంగా ఎంత తగ్గాయంటే..
దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మందగమనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆటో ఇండస్ట్రీ పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టవచ్చు. ఓవరాల్ వెహికిల్ సేల్స్ 12.05 శాతం తగ్గాయి. గత ఏడాది నవంబర్ నెలలో మొత్తం సేల్స్ 20,38,007 యూనిట్లు కాగా, ఈ ఏడాది అదే సమయంలో సేల్స్ 17,92,415 యూనిట్లుగా ఉన్నాయి.

ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు..
- ఏప్రిల్ నుంచి నవంబర్ పీరియడ్‌లో ఆటో సేల్స్ 15.95 శాతం తగ్గాయి. ప్యాసింజర్ వెహికిల్స్, టూ వీలర్స్, కమర్షియల్ వెహికిల్స్ సహా అన్నీ కలిపి ఈ కాలంలో 15,705,447 యూనిట్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది (2018)లో ఇదే సమయంలో 18,686,895 యూనిట్లు సేల్ అయ్యాయి.
- ఇదే కాలంలో కేవలం ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ 17.98 శాతం తగ్గింది. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఈ సేల్స్ ఈ ఏడాది 1,882,051 కాగా, గత ఏడాది 2,294,502 యూనిట్లుగా ఉంది.
- టూవీలర్ డొమెస్టిక్ సేల్స్ 15.74 శాతం తగ్గాయి. గత ఏడాది ఏప్రిల్ - నవంబర్ మధ్యలో 15,267,778 యూనిట్లు కాగా, ఈ ఏడాది 12,864,936కు తగ్గాయి.
- కమర్షియల్ వెహికిల్ సెగ్మెంట్‌లో సేల్స్ 22.12 శాతం తగ్గాయి. మీడియం, హెవీ కమర్షియల్ వెహికిల్ సేల్స్ 37.32 శాతం తగ్గాయి. వీటి సేల్స్ గత ఏడాది 247,005 కాగా, ఈ ఏడాది 154,814 యూనిట్లుగా ఉంది.
- లైట్ మోటార్ వెహికిల్స్ సేల్స్ 12.74 శాతం తగ్గాయి. ఏప్రిల్ - నవంబర్ మధ్య ఈ సేల్స్ 349,266 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయంలో 647,278 సేల్ అయ్యాయి.
- అన్ని వాహనాల ఉత్పత్తి కూడా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు తగ్గిపోయింది. గత ఏడాదితో పోలిస్తే 13.75 శాతం తగ్గింది.

చైనా కంటే బెట్టర్
కేవలం భారత్‌లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా మందగమన పరిస్థితులు ఉన్నాయి. ఇతర ఎన్నో దేశాల కంటే భారత్ కాస్త బెట్టర్‌గా కనిపిస్తోంది. భారత్‌లో ఏడాదికి పైగా ఆటో సేల్స్ తగ్గుతున్నాయి. కానీ చైనాలో అంతకంటే దారుణ పరిస్థితి నెలకొని ఉంది. చైనాలో ఏకంగా 17వ నెల (నవంబర్) కూడా సేల్స్ తగ్గాయి. ప్రపంచంలో అతిపెద్ద ఆటో మార్కెట్. ఇక్కడ గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో సేల్స్ 3.6 శాతం తగ్గాయి. అక్టోబర్ నెలలో 4 శాతం, సెప్టెంబర్‌లో 5.2 శాతం తగ్గాయి. చైనాలో ఆర్థిక వృద్ధి మందగించడం, వాణిజ్య యుద్ధం వంటి వివిధ కారణాలతో 1990 తర్వాత ఇక్కడ కారు సేల్స్ వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. 1990 తర్వాత మొదటిసారి గత ఏడాది కంటే ఈ ఏడాది కారు సేల్స్ తగ్గాయి.

43.7 శాతం పడిపోయిన NEV సేల్స్
నవంబర్ నెలలో NEV సేల్స్ ఏకంగా 43.7 శాతం తగ్గిపోయినట్లు చైనా అసోసియేషన్ ఆఫ్ అటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ (CAAM) తెలిపింది. అక్టోబర్ నెలలో ఈ సేల్స్ 45.6 శాతం తగ్గాయి. విస్తృత ఆటో మార్కెట్ కుదించినప్పటికీ గత ఏడాది మాత్రం ఏకంగా 62 శాతం వృద్ధి సాధించాయి. ఇప్పుడు భారీగా పడిపోయాయి.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications