టాటా మోటార్స్ ఫలితాలు పెట్టుబడిదారులకు షాకిచ్చాయి. దీంతో గురువారం ట్రేడింగ్‌లో టాటా మోటార్స్ షేర్ 5 శాతం కుప్పకూలింది. జాగ్వార్ ల్యాండ్ ఓవర్ అమ్మకాలు పెరిగినా, దేశీయంగా అమ్మకాలు ఈ అంచనాలను అందుకోలేదు. గురువారం టాటా మోటార్స్ స్టాక్ రూ. 433 వద్ద ముగిసింది. మరోవైపు జనవరి 2023 నుండి న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి అమెరికన్ డిపాజిటరీ రసీదులను (ADRలు) తొలగించనున్నట్లు నవంబర్ 9న టాటా మోటర్స్ ప్రకటించింది.
తగ్గిన నష్టాలు
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన టాటా మోటార్స్ నష్టాలు రూ.945 కోట్లకు తగ్గాయి. గతేడాది(2021-22) ఇదే కాలంలో ఏకంగా రూ. 4,442 కోట్ల నష్టం వచ్చింది. ఆదాయం కూడా గతేడాదితో పోలిస్తే రూ. 62,246 కోట్ల నుంచి రూ. 80,650 కోట్లకు పెరిగింది.
సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) ఆదాయం 36శాతం జంప్‌చేసి 5.3 బిలియన్ పౌండ్లను తాకిట్ల కంపెనీ తెలిపింది. కంపెనీ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో 326శాతం వృద్ధితో 11,522 యూనిట్లు అమ్మింది. ఈ స్టాక్ 12 మే 2022న రూ. 366.05 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది.

More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications