భారతీయ ఇ-చెల్లింపు ప్లాట్‌ఫామ్‌లో సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్ $215 మిలియన్ల విలువైన షేర్లను విక్రయిస్తుందని వార్తలతో Paytm మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు భారీగా పడిపోయాయు. దాదాపు 10 శాతం పడిపోయాయి. రాయిటర్స్ కథనం ప్రకారం పేటీఎం ఒక్కో షేరుకు రూ. 555 నుంచి 601.45 పరిధిలో విక్రయించబోతున్నట్లు తెలిపింది. దీంతో పేటీఎం స్టాక్ రూ. 549 లకు పడిపోయంది.
లాకిన్ పిరియడ్
జూలై 26, 2022 తర్వాత Paytm స్టాక్‌లో ఇది కనిష్ట స్థాయి. సెప్టెంబర్ 30 నాటికి పేటీఎం కంపెనీలో సాఫ్ట్‌బ్యాంక్ 17.5 శాతం వాటాను కలిగి ఉంది. నవంబర్ 18, 2022, అంటే శుక్రవారంతో Paytm IPO యాంకర్ పెట్టుబడి దారులు లాకిన్ పిరియడ్ ముగుస్్తుంది. దీంతో పేటీఎం స్టాక్ లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. Paytm IPO గత సంవత్సరం నవంబర్ 2021 లో వచ్చింది.

నైకా
అప్పుడు కంపెనీ ఒక్కో షేరు ధర రూ.2150 చొప్పున ఐపీఓ జారీ చేసింది. కానీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ అయినప్పటి నుంచి, Paytm స్టాక్ క్షీణిస్తూనే ఉంది. రూ.2150 షేర్ ఇప్పుడు రూ.549 వద్ద ట్రేడవుతోంది. అంటే, ఈ షేరు IPO ధర కంటే 75 శాతం దిగువన ట్రేడవుతోంది. Paytm మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.35,469 కోట్లకు తగ్గింది. పేటీఎం స్టాక్ అంతకుముందు రూ.510 స్థాయికి పడిపోయింది. అటు నైకాలో కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. యాంకర్ ఇన్వెస్టర్ల లాకిన్ పిరియడ్ ముగియడంతో నైకా స్టాక్ లో తగ్గుదల కనిపిస్తుంది.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications