Devyani International: దేవయాని ఇంటర్నేషనల్ షేర్లులో జంప్.. ఎందుకంటే..!
దేవయాని ఇంటర్నేషనల్ షేర్లు మే 18న BSEలో ఉదయం ట్రేడింగ్‌లో 5 శాతానికి పైగా పెరిగాయి. బుధవారం కంపెనీ నాలుగో త్రైమాసి ఫలితాలను ప్రకటించింది. FY23 మార్చి త్రైమాసికంలో కంపెనీ తన నికర లాభంలో తగ్గుదల నమోదు చేసింది. భారత్ లో KFC, పిజ్జా హట్ అతిపెద్ద ఫ్రాంఛైజీ అయిన కంపెనీ, మే 17న మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో రూ.60.7 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. EBITDA మార్జిన్ 23.6 శాతం నుంచి 20.4 శాతానికి తగ్గింది.
ఈ ఫలితాల తర్వాత బుధవారం బిఎస్‌ఇలో దేవయాని ఇంటర్నేషనల్ షేర్లు 4.45 శాతం దిగువన ముగిసింది. అయితే బ్రోకరేజ్ సంస్థల నుంచి వచ్చిన సానుకూల ప్రకటనలతో గురువారం ఈ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బ్రోకరేజ్ సంస్థ కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ దేవయాని ఇంటర్నేషనల్‌లో 'యాడ్' కాల్ చేసింది.బ్రోకరేజ్ సంస్థ తన KFC స్టోర్ అంచనాను పెంచుతూ, మార్జిన్ అంచనాలు మరియు EBITDA అంచనాలను కూడా సర్దుబాటు చేస్తూ నిర్వహణ మార్గదర్శకత్వంతో సమలేఖనం చేస్తూ స్టాక్‌పై టార్గెట్ ధరను రూ.160 నుంచి రూ.180కి పెంచింది.

KFC ఇండియా విభాగంలో దేవయాని 29 కొత్త స్టోర్‌లను ప్రారంభించింది. దీంతో మొత్తం కేఎఫ్సీ మొత్తం స్టోర్ల సంఖ్య 490కి చేరుకుందని కోటక్ హైలైట్ చేసింది. "KFC ఇండియా సెగ్మెంట్ ఆదాయాలు మా అంచనా ప్రకారం రూ.440 కోట్లకు అనుగుణంగా ఉన్నాయి. ఇది సంవత్సరానికి 26 శాతం పెరిగింది" అని కోటక్ చెప్పారు. పిజ్జా హట్ (PH) విభాగంలో, దేవయాని 23 కొత్త స్టోర్‌లను జోడించారు. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 506కి చేరుకుంది.
బ్రోకరేజ్ సంస్థ ప్రకారం పిజ్జా హట్ రూ.170 కోట్లతో ఆదాయంతో సంవత్సరానికి 16 శాతం పెరిగింది. బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్‌కు టార్గెట్ ప్రైస్ ను రూ.200 గా నిర్ణయించింది.


Click it and Unblock the Notifications