న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. మలి విడత సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతోంది. కీలక శాఖల్లో సంస్కరణలను చేపట్టబోతోంది. కేంద్రం నియమించిన పార్లమెంటరీ ప్యానెల్ కమిటీ ఈ మేరకు సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ (డీఏపీఆర్‌పీజీ) చర్యలు తీసుకోనుంది.

మలి విడత సంస్కరణల కోసం..
రైల్వేలు, ఉపరితల రవాణా, జాతీయ రహదారులు, పెట్రోలియం, సహజవాయు, విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం వంటి కీలక మంత్రిత్వ శాఖలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా శాఖలన్నీ సంస్థాగతంగా బలహీనంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వాటిల్లో పాలనాపరమైన సంస్కరణలను చేపట్టాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ పార్టీ సిఫారసు చేసినట్లు డీఏఆర్‌పీీజీ వెల్లడించింది. రెండో విడత పాలనాపరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టాల్సి ఉందని తెలిపింది.

హోదాల తగ్గింపు..
ఇందులో భాగంగా ఆయా శాఖల్లో కొన్ని స్థాయిలు, హోదాలను తగ్గించుకోవాల్సి ఉంటుందని సూచించింది. టీమ్ వర్క్‌ను ప్రోత్సహించడం, జవాబుదారీతనాన్ని ఏర్పరచుకోవడం, ఆపరేషనల్ యూనిట్స్‌లో లోపాలను సవరించుకోవడం వంటివి పునఃసమీక్షించుకోవాలని, దీనితోపాటు ఆయా విభాగాలు, శాఖలన్నీ సమర్థవంతంగా తయారయ్యేలా తమ పని తీరును మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

డెస్క్ ఆఫీసర్ల వ్యవస్థను ఆపరేషనలైజ్డ్..
అన్ని మంత్రిత్వ శాఖల్లోనూ డెస్క్ ఆఫీసర్ వ్యవస్థను ఆపరేషనలైజ్డ్ చేయాల్సి ఉంటుందని డీఏఆర్‌పీజీ తేల్చి చెపింది. ఒక్క విదేశాంగ మంత్రిత్వ శాఖలోనే 264 డెస్క్ ఆఫీసర్లు ఉన్నారని తెలిపింది. వారందరూ వేర్వేరు దేశాలకు సంబంధించిన లావాదేవీలు, భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక, బహుళ ప్రయోజనకర వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేసింది. దీన్ని ఆపరేషనలైజ్డ్ చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకునేలా చూడాలని పేర్కొంది.

రైల్వేలో తగ్గిన పేపర్ వినియోగం..
రైల్వేలో పేపర్ వినియోగం భారీగా తగ్గిందని డీఏఆర్‌పీజీ తెలిపింది. 2018లో 22,685 పేపర్ రీమ్స్‌ను వినియోగించగా.. 2021 నాటికి ఈ సంఖ్య 10,272కు తగ్గిందని వివరించింది. దీనివల్ల ప్రింట్ కోసం వినియోగించే క్యాట్రిడ్జ్ ఖర్చు కోటి 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయలకు తగ్గిందని తెలిపింది. ఇలా పాలనాపరమైన సంస్కరణలను అమలు చేయడం, స్థాయిలను కుదించుకోవడం వల్ల వ్యయాన్ని అదుపు చేసినట్టవుతుందని పేర్కొంది. దీన్ని ఆయా శాఖలన్నీ సమర్థవంతంగా అమలు చేయాలని సూచించింది.

బ్యాంకుల్లోనూ..
దీనితో పాటు ఈ సంస్కరణల పర్వాన్ని జాతీయ బ్యాంకుల్లోనూ అమలు చేయడానికి సన్నద్ధమైంది. ఇందులో భాగంగా జాతీయ బ్యాంకుల్లో తనకు ఉన్న వాటాలను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించుకోబోతోంది. దీనికోసం కసరత్తు చేస్తోంది. దాదాపు 14 జాతీయ బ్యాంకుల్లో ఉన్న తన వాటాలను తగ్గించుకోవడానికి ప్రతిపాదనలను సైతం సిద్ధం చేసింది కేంద్రం ప్రభుత్వం. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరంభం అయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రక్రియను చేపట్టొచ్చని తెలుస్తోంది.

51 శాతం వాటా 26కు కుదింపు..
ప్రస్తుతం జాతీయ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటా 51 శాతం. దీన్ని 26 శాతానికి తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే సగానికి తగ్గించుకోవడం అవుతుంది. ఆ మిగిలిన 25 శాతం వాటాను ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులకు కట్టబెట్టడం ఖాయమౌతుంది. ప్రైవేటు ఆర్థిక సంస్థలకు జాతీయ బ్యాంకుల్లో అధికవాటాలను కల్పించాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు. రెండు బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిల భారత బ్యాంక్ ఉద్యోగ సంఘాల సమాఖ్య ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళనలను లేవనెత్తారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications