కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో భారత దేశంలో సేవా కార్యకలాపాలు భారీగా కుప్పకూలిపోయాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) 5.4 శాతానికి పడిపోయింది. సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ఉత్పత్తి, సేవారంగాల్లో ఆర్థిక ట్రెండ్‌ను సూచించేదే పీఎంఐ. ఈ మేరకు ఓ ప్రయివేటు సర్వే బుధవారం సర్వీస్ సెక్టార్ యాక్టివిటీస్ దారుణంగా పడిపోయినట్లు తెలిపింది. ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వీసెస్ ప్రకారం PMI మార్చి నెలలో 49.3 శాతంగా ఉండగా, ఏప్రిల్‌లో 5.4 శాతానికి పడిపోవడం గమనార్హం. ఇది 14 ఏళ్ల నుండి సర్వే చేస్తోంది. అప్పటి నుండి ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి.
ఏప్రిల్ నెలలో వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో
ఇండియన్ సర్వీసెస్ ఎకానమీ నెలవారీగా చూస్తే కనిష్టానికి పడిపోయింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను ప్రకటించిందని, కఠిన లాక్ డౌన్ నిబంధనలతో 40 పాయింట్లకు పైగా పడిపోయిందని ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వీసెస్ ఎకనమిస్ట్ జో హేస్ చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా భారీ ప్రభావం పడిందన్నారు.

గత నెల అంటే ఏప్రిల్ 7వ తేదీ నుండి 28వ తేదీ వరకు డేటాను కలెక్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను తొలుత ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆ తర్వాత మే 3వ తేదీ వరకు, మూడోసారి మే 17వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగాలపై కూడా ప్రభావం పడుతోంది. కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తే, మరికొన్ని కంపెనీలు వేతనాల్లో కోత విధిస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు వర్క్ ఫోర్స్‌లో మార్పు లేదని చెప్పాయి. కొత్త నియామకాలు ఉండవని తెలిపాయి.
ఈ సర్వే ప్రకారం సేవల కోసం విదేశీ డిమాండ్ మొత్తమే పడిపోయింది. విదేశీ డిమాండ్ ఏకంగా 0.0కు పడిపోయింది. మొత్తంగా సేవా కార్యకలాపాలు రికార్డ్ కనిష్టానికి తగ్గాయి. సేవల కార్యక్రమాలతో కలిసి మార్చిలో మిశ్రమ పీఎంఐ 50.6 ఉండగా గత నెలలో ఆల్ టైమ్ లో 7.2 కనిష్టస్థాయికి పడిపోయింది. లాక్ డౌన్ ఆంక్షలు క్రమంగా సడలించడం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు ఉపయోగపడవచ్చునని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications