అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. దీంతో సోమవారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అయితే మంగళవారం మాత్రం కోలుకున్నాయి. ఉదయం గం.9.22 సమయానికి లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఎక్కువ రంగాల షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. గం.9.57 నిమిషాలకు సెన్సెక్స్ 498 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 141 పాయింట్లు ఎగబాకింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.64 వద్ద ఉంది.
సెన్సెక్స్ ఉదయం గం.10.45 సమయానికి 423.66 (1.04%) పాయింట్ల లాభంతో 41,100.29 వద్ద, నిఫ్టీ 123.55 (1.03%) ఎగబాకి 12,116.60 వద్ద ట్రేడ్ అయింది. ఏ క్షణంలో అయినా పరిస్థితులు ఎలాగైనా మారవచ్చుననే సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

పదిన్నర గంటల సమయం వరకు ఎల్ అండ్ టీ, ఆర్బీఎళ్ బ్యాంకు, జీఎంఆర్, వేదాంత, అదానీ, బీహెచ్ఈఎల్, ఎస్బీఐ, యస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, వేదాంత, జీ ఎంటర్టైన్మెంట్ వంటి షేర్లు లాభాల్లో ట్రేడ్ కాగా, ఎన్ఎండీసీ, బయోకాన్, టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఆటో నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. రంగాల వారీగా చూస్తే రియాల్టీ, బ్యాంకింగ్, లోహ రంగ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా, ఐటీ రంగ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications